పాక్ రైలులో అగ్ని ప్రమాదం: 62 మంది ప్రయాణికులు మృతి..

-

కరాచీ-రావల్పిండి తేజ్గామ్ ఎక్స్ ప్రెస్ రైల్లో గ్యాస్ సిలిండర్ పేలి భారీ అగ్ని ప్రమాదం సంభవించిన విష‌యం తెలిసిందే. పాకిస్థాన్ లోని రహీమ్ యార్ ఖాన్ సమీపంలోని లియాకత్పూర్ లో జరిగిన ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగింది. రహీమ్ యార్‌ఖాన్ సమీపంలోని లియాఖత్‌పూర్ వద్ద రైలులోని గ్యాస్ సిలిండర్ పేలడంతో 62 మంది సజీవ దహనమయ్యారని, మరో 13 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. రైలులో మంటలు చెలరేగడంతో రెండు బోగీలు దగ్ధమయ్యాయని వివరించారు.

ప్రయాణికుల్లో కొందరు కోడి గుడ్లు ఉడకపెట్టడానికి గ్యాస్‌ వెలిగించారని, ఈ కారణంగానే మంటలు చెలరేగాయని సమాచారం. అగ్నిమాపక దళాలు, ఆర్మీ సిబ్బంది సహాయ చర్యల్లో పాల్గొన్నారు. ఈ ప్రమాదంలో గాయాలపాలైన వారిని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఈ ఘోర ప్రమాదంపై పాక్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్ విచారం వ్యక్తం చేశారు. గాయాలపాలైన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news