ఆసియాలోనే అపర కుబేరుడిగా అదానీ.. రెండో స్థానంలో అంబానీ

-

ఆసియాలో అత్యంద ధనవంతుడి జాబితాలో గౌతమ్ అదానీ నిలిచారు. అదాని గ్రూప్ ఛైర్మన్ గా ఉన్న గౌతం అదానీ అపరకుబేరుడిగా అవతరించినట్లు బ్లూమ్ బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ వెల్లడించించి. రెండోస్థానంలో ముఖేష్ అంబానీ నిలిచారు. బ్లూమ్ బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ జాబితాలో ప్రపంచంలోనే 10వ స్థానంలో అదానీ, 11 స్థానంలో అంబానీ నిలిచారు. గౌతమ్‌ అదానీ నికర సంపద 88.5 బిలియన్‌ డాలర్లకు (రూ.6,65,000 కోట్లకు) చేరింది. అదే సమయంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధిపతి ముకేశ్‌ అంబానీ సంపద 87.9 బిలియన్‌ డాలర్లుగా (రూ.6,50,000 కోట్లు) ఉంది. గత రెండేళ్లలో అదానీ షేర్లు 600 శాతానికి పైగా పెరగడమే ఇందుకు కారణంగా బ్లూమ్ బర్గ్ నివేదిక వెల్లడించింది. గత 14 ఏళ్లుగా దేశంలో అత్యంత ధనవంతుడిగా ఉన్న అంబానీని అదానీ అధిగమించాడు. ఒక్క ఏడాది కాలంలోనే అదానీ ఆదాయం 12 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.90,000 కోట్లు) కు పెరిగింది.

పోర్టులు, విమాశ్రయాలు, ఇంధన రంగాల్లో అదానీ ఉన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహిస్తుండటంతో ఈ రంగంలో కూడా పెట్టుబడులు పెడుతున్నాడు అదాని. అదానీకి ప్రస్తుతం 12 పోర్ట్‌లు ఉన్నాయి. 2030 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద పోర్ట్‌ల ఆపరేటర్‌గా అవతరించాలని అనుకుంటున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news