కోహ్లీ కాచుకో.. నాతో పోటీ ప‌డేందుకు సిద్ధంగా ఉండు : క్రిస్ గేల్

-

పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ ఐపీఎల్ లో మరో ఘనతను సాధించాడు. గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో కోహ్లీ 61 బంతుల్లో 101 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ సీజన్ లో కోహ్లీకి ఇది వరుసగా రెండో సెంచరీ. ఈ క్రమంలో వెస్టిండీస్ విధ్వంసక బ్యాట్స్ మెన్ క్రిస్ గేల్ రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు. అత్యధిక సెంచరీలను సాధించిన బ్యాట్స్ మెన్ గా అవతరించాడు. ఐపీఎల్ లో గేల్ 6 శతకాలను సాధించగా… కోహ్లీ 7 సెంచరీలతో గేల్ ను అధిగమించాడు. హాఫ్ సెంచరీలలో కూడా ఐపీఎల్ రికార్డు కోహ్లీ పేరిటే ఉంది. ఇప్పటి వరకు కోహ్లీ 50 హాఫ్ సెంచరీలను నమోదు చేయగా… 31 అర్ధ శతకాలతో గేల్ రెండో స్థానంలో ఉన్నాడు.

తాను నెల‌కొల్పిన రికార్డును కోహ్లీ అధిగ‌మించ‌డంపై ఆర్సీబీ మాజీ ఆట‌గాడైన‌ గేల్ స‌ర‌దాగా కామెంట్ చేశాడు. ‘కోహ్లీ కాచుకో.. నేను రిటైర్మెంట్ నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకుంటున్నా. వ‌చ్చే ఏడాది నాతో పోటీ ప‌డేందుకు సిద్ధంగా ఉండు’ అని గేల్ జోక్ చేశాడు. న్ని వెన‌క్కి తీసుకుంటున్నా. వ‌చ్చే ఏడాది నాతో పోటీ ప‌డేందుకు సిద్ధంగా ఉండు’ అని గేల్ జోక్ చేశాడు. ఈ సీజ‌న్‌లో బెంగ‌ళూరుకు చావోరేవే లాంటి రెండు మ్యాచుల్లో కోహ్లీ వంద కొట్టాడు. ఉప్ప‌ల్ స్టేడియంలో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌పై సెంచ‌రీ బాది గేల్ రికార్డు స‌మం చేశాడు. ఆ మ్యాచ్‌లో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో గెలిచింది. ఆఖ‌రి లీగ్ మ్యాచ్‌లో గుజ‌రాత్ టైటాన్స్‌పై కోహ్లీ శ‌త‌కం బాది జ‌ట్టుకు భారీ స్కోర్ అందించాడు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version