ఈ పోస్ట్ ఆఫీస్ స్కీమ్ తో… రూ.14 లక్షలు… పూర్తి వివరాలు ఇవే..!

పోస్ట్ ఆఫీస్ ఎన్నో రకాల స్కీమ్స్ ని అందిస్తోంది. ఈ స్కీమ్స్ లో చాలా మంది డబ్బులు పెడుతున్నారు. అదిరే లాభాలని పొందుతున్నారు. పోస్టాఫీస్‌లో పలు రకాల సేవింగ్ స్కీమ్స్ వున్నాయి. అందులో నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ కూడా ఒకటి. ఈ స్కీమ్ తో అదిరిపోయే రాబడి పొందొచ్చు. కచ్చితమైన రిటర్న్ వస్తుంది. ఎలాంటి రిస్క్ ఉండదు. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే…

ఎంత మొత్తాన్ని అయిన డిపాజిట్ ని ఇందులో చేసేయచ్చు. ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. దీనిలో కావాలంటే ఒకటి కంటే ఎక్కువ అకౌంట్లు కలిగి ఉండొచ్చు. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్‌లో చేరాలంటే దగ్గర లో పోస్టాఫీస్‌కు వెళ్లి చేరవచ్చు. ఈ స్కీమ్‌పై 7 శాతం వడ్డీ రేటు వస్తోంది. స్కీమ్ మెచ్యూరిటీ కాలం ఐదేళ్లు.

స్కీమ్‌ లో చేరడం వల్ల రూ. 1000 డిపాజిట్‌ పై మెచ్యూరిటీ సమయం లో రూ. 1403 పొందొచ్చు. రూ. 10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ సమయంలో రూ. 14 లక్షలకు పైగా మీకు వస్తాయి. వడ్డీ రూపంలో రూ. 4 లక్షలకు పైగా వస్తాయి. రూ.1000 మొత్తం తో మీరు ఎన్‌ఎస్‌సీ అకౌంట్ ని తెరవచ్చు.

ఆ తరవాత మీరు డబ్బులు డబ్బులని పెట్టవచ్చు. గరిష్ట పరిమితి ఏమి ఉండదు. దీనిలో ఎంతైనా డబ్బులు పెట్టుకోవచ్చు. బ్యాంక్ లేదా ఎన్‌బీఎఫ్‌సీలు తనఖా పెట్టుకొని లోన్ ని కూడా పొందవచ్చు. దీనిలో ఒక వ్యక్తి పేరు నుండి ఇంకో వ్యక్తి పేరుకు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.