పోస్ట్ ఆఫీస్ స్కీమ్.. రూ.5 లక్షలు డిపాజిట్ చేస్తే రూ.2.25 లక్షలు..!

-

ఈ రోజుల్లో చాలా మంది వారికి నచ్చిన స్కీమ్స్ లో డబ్బులని పెడుతున్నారు. అయితే ఇలా ఇన్వెస్ట్ చేస్తే మంచిగా లాభాలు ఉంటాయి. చాలా మంది పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచిగా లాభాలు ఉంటాయి. భారత ప్రభుత్వం అందిస్తున్న కొన్ని సేవింగ్ స్కీమ్స్ తో మంచి వడ్డీ వస్తోంది. ఇండియా పోస్ట్ అందించే పోస్టాఫీస్ టైమ్‌ డిపాజిట్ స్కీమ్ అన్నిటి కంటే ఆకర్షణీయంగా కనపడుతోంది. స్థిరమైన ఆదాయాన్ని ఈ స్కీము తో పొందవచ్చు. ఇక పూర్తి వివరాలను చూస్తే… 1 నుంచి 5 ఏళ్ల వరకు వివిధ టర్మ్ ఆప్షన్లతోపెట్టుబడిపై హామీతో కూడిన రాబడిని అందిస్తుంది.

ఈ పోస్ట్ ఆఫీస్ స్కీమ్ లో రూ.5 లక్షలు డిపాజిట్ చేస్తే వడ్డీగా ఏకంగా రూ.2.25 లక్షలు వస్తుంది. పోస్టాఫీసు టైమ్ డిపాజిట్ స్కీమ్ అనేది ఫిక్స్‌డ్ డిపాజిట్ల లాగ పని చేస్తుంది. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు అనే నాలుగు కాలవ్యవధులతో ఇది ఉంటుంది. వడ్డీ ని త్రైమాసికంలో లెక్కిస్తారు. మీకు దీన్ని ఏటా చెల్లిస్తారు. 1 ఏడాదికి 6.8%, 2 సంవత్సరాలకు 6.9%, 3 సంవత్సరాలకు 7%, 5 సంవత్సరాలకు 7.5%గా వుంది. ఈ స్కీమ్ లో ఎంతైనా కూడా పెట్టచ్చు. దీనిలో కనీస పెట్టుబడి రూ.1000 గా వుంది.

చట్టంలోని సెక్షన్ 80C కింద, ఐదేళ్ల టైమ్ డిపాజిట్లకు ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా వున్నాయి. ఐదేళ్ల టెన్యూర్‌తో రూ.5 లక్షలు పెట్టుబడి పెడితే వడ్డీగా రూ.2,24,974 వస్తాయి. సగటు వార్షిక రాబడి 7.71%. మెచ్యూరిటీ సమయంలో దీనితో పాటు పెట్టుబడిదారులు అసలు కూడా తీసుకోవచ్చు. దీనిలో రూ.5లక్షలు డిపాజిట్ చేస్తే ఐదేళ్లకు వడ్డీ, అసలు కలిపి సుమారు రూ.7.25 లక్షలు వస్తాయి. పోస్టాఫీస్ టైమ్‌ డిపాజిట్ స్కీమ్‌లో బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల మాదిరిగానే త్రైమాసిక ప్రాతిపదికన వడ్డీ రేటు సవరణలు ఉంటాయి. 6.8% నుంచి 7.5% వరకు అధిక వడ్డీ రేట్లను ఇస్తోంది. రిజర్వ్ బ్యాంక్ రెపో రేటుపై ఆధారపడి ఉండవు. మెచ్యూరిటీ తర్వాత పోస్టాఫీస్ టైమ్‌ డిపాజిట్ అకౌంట్‌ను ఎక్స్టెండ్ చెయ్యచ్చు. అత్యవసర పరిస్థితుల్లో ఈ పథకంలోని నిధులను తాకట్టు పెట్టి లోన్ కూడా తీసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news