అమెరికాలో కాల్పులతో యువకుడి వీరంగం.. ముగ్గురి మృతి

-

అమెరికాలో మరోసారి తుపాకీ మోత మోగింది. అగ్రరాజ్యాన్ని తరచూ కాల్పుల మోత వణికిస్తోంది. ముఖ్యంగా అక్కడ ఉంటున్న భారతీయ యువత నిత్యం భయంతో బతకాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా ఆ దేశంలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. పద్దెనిమిదేళ్ల యువకుడు మూడు తుపాకులతో విచక్షణరహితంగా జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించారు. మరో ఇద్దరు పోలీసు అధికారులు సహా ఆరుగురికి గాయాలయ్యాయి.

అమెరికాలోని న్యూమెక్సికో, అరిజోనా, ఉటా, కొలరాడొ రాష్ట్రాల సరిహద్దులు కలుసుకునే ఫోర్‌ కార్నర్స్‌ ప్రదేశానికి దగ్గర్లో ఉన్న ఫార్మింగ్టన్‌ నగరంలో సోమవారం ఉదయం 11 గంటలకు ఈ ఉదంతం చోటుచేసుకుంది. యువకుడు తుపాకులతో తిరుగుతూ వాయవ్య న్యూమెక్సికో సంఘం ప్రాంతంలో కార్లు, ఇళ్లపైకి ఇష్టం వచ్చినట్లు కాల్పులు జరిపాడు. ఈ విషయం తెలిసిన వెంటనే ఫార్మింగ్టన్‌ పోలీసు అధికారులు రంగంలోకి దిగి… అతణ్ని కాల్చిచంపారు. కాల్పుల వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటో ఇప్పటికీ తెలియరాలేదు. కాల్పుల ఉదంతంలో ఆరు నివాసాలు, మూడు కార్లు దెబ్బతిన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news