ఫోన్ పే: రూ.950తో రూ.5 లక్షలు.. ఎలా అంటే..?

-

ఫోన్‌పే ఉందా..? అయితే మీకు గుడ్ న్యూస్. దిగ్గజ యూపీఐ ప్లాట్‌ఫామ్‌ ఫోన్‌పే తన కస్టమర్లకు గుడ్ న్యూస్ ని తీసుకు వచ్చింది. కొత్త సర్వీసులు ని ఇప్పుడు అందిస్తోంది. తాజాగా హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ అందుబాటు లోకి తెచ్చింది. పూర్తి వివరాలు చూస్తే.. ఇన్సూరెన్స్ కంపెనీలతో భాగస్వామ్యం ద్వారా సమగ్రమైన ఇన్సూరెన్స్ సేవలు ని ఇప్పుడు అందిస్తోంది. మంత్లీ పేమెంట్ ఆప్షన్ కూడా ఉంటుంది. హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను నెలవారీ చెలింపుతో కూడా కొనుగోల చేయొచ్చు.

phonepe

ఫోన్‌పే ఇన్సూరెన్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఏకంగా 56 లక్షల పాలసీలను విక్రయించింది. దేశంలో 98 శాతం పిన్‌కోడ్స్‌కు ఈ సేవలు అందుబాటులో వుంటున్నాయట. రూ. కోటి వరకు కవరేజ్‌తో హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ని తీసుకోవచ్చు. పరిమితులు లేకుండా హాస్పిటల్ రూమ్ ని కూడా పొందొచ్చు. బోనస్ కవర్ ఆప్షన్ కూడా వుంటుందట. ప్రి, పోస్ట్ సేల్స్ అసిస్టెన్స్ ని కూడా పొందవచ్చు.

ఇన్సూరెన్స్ కోసం ముందుగా యాప్‌లోకి వెళ్లాలి.
అక్కడ ఇన్సూరెన్స్ సెక్షన్‌లోకి వెళ్లాలి.
మీ వివరాలను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత కోట్స్ కనిపిస్తాయి.
నచ్చిన దాన్ని ఎంచుకోవచ్చు. వివరాలను చెక్ చేసుకోవాలి. పేమెంట్ చేయాలి.
డబ్బులని మీరు నెలవారీగా లేదంటే వార్షికంగా చెల్లించొచ్చు. నచ్చిన ఆప్షన్ ఎంచుకోవచ్చు.
రూ.5 లక్షల మొత్తానికి హెల్త్ పాలసీ తీసుకుంటే నెలకి మీరు దాదాపు రూ.950 పే చేయాలి. తల్లిదండ్రులు, ఇద్దరు పిల్లలకు ఈ పాలసీ వర్తిస్తుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news