కేంద్ర ప్రభుత్వ స్కీమ్: ఒక్కో కుటుంబానికి ఏటా రూ.5 లక్షలు.. ఈ కార్డు డౌన్‌లోడ్ చేసుకోండి వెంటనే..!

-

కేంద్ర ప్రభుత్వం అనేక స్కీములని తీసుకు వచ్చింది. కేంద్రం తీసుకు వచ్చిన స్కీమ్స్ వలన చాలా మందికి ప్రయోజనం కలుగుతోంది. నిరుపేద వర్గాలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు కూడా కేంద్రం పథకాల్ని తెచ్చింది. ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన పీఎంజేవై స్కీమ్ అది. ఉచితంగా రూ. 5 లక్షల వరకు సాయం ని కేంద్రం ఒక్కో కుటుంబానికి అందిస్తోంది. అర్హులైన నిరుపేద కుటుంబాలు ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా ఈ స్కీమ్ బెనిఫిట్స్ ని పొందవచ్చు.

3 రోజుల ముందు ఆసుపత్రిలో చేర్చడంతో పాటు డిశ్చార్జి అయిన 15 రోజుల పాటు చికిత్సకు అయ్యో ఖర్చులు కేంద్రమే పెట్టుకుంటుంది. మొత్తం 1400 రకాల వైద్య ప్రొసీజర్లు, ఆపరేషన్ థియేటర్ ఖర్చుల వంటివి దీనిలో వున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రిల్లో ఫ్రీగా చికిత్స అందించడమే ఈ స్కీమ్ లక్ష్యం. గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీ, 16 నుంచి 59 ఏళ్ల వయసున్న మగవాళ్లు లేని కుటుంబాలకు, వికలాంగులు ఉన్న కుటుంబాలు ఈ స్కీమ్ బెనిఫిట్స్ పొందొచ్చు.

అలానే ఏ పనీ చేయలేని వృద్ధులు ఉన్న కుటుంబాలకు, ఇల్లు లేని, రోజు కూలీకి వెళ్లేవారు, ఆదివాసీ సమాజాలు, ఒకే గదిలో జీవిస్తున్న కుటుంబాలు, పారిశుద్ధ్య పనుల్లో ఉన్న కుటుంబాలకు కూడా ఈ స్కీమ్ అవుతుంది. https://pmjay.gov.in/ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు. పీఎంజేఏవైకి అర్హులు అని నిర్ధరణ అయ్యాక ఇ-కార్డు ఇస్తారు. ఆ తరవాత కార్డు కోసం ప్రయత్నించవచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news