మంత్రి మల్లా రెడ్డికి మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే KLR కౌంటర్ ఇచ్చారు. మంత్రి మల్లా రెడ్డి చిల్లర మాటలు మాట్లాడుతూ తన స్థాయిని తానే దిగజార్చుకుంటున్నారని..నేను రాజకీయాల్లో ఉన్నపుడు నువ్వు స్కూటర్ పైన కల్తీ పాలు అమ్ముకుంటున్నావని చురకలు అంటించారు. జోకర్ బ్రోకర్ మాటలు ప్రజలు పత్రికా సోదరులు నమ్మవద్దని కోరారు. డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యే టికెట్ కొనుక్కోవడం కాదు..ప్రజలకు సేవచేసెందుకే రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు కేఎల్‌ఆర్.
మంత్రి మల్లా రెడ్డి నాకు టికెట్ ఇప్పించడం కాదు గత ఎన్నికల్లో నాకు TRS టికెట్ ఇస్తానంటే నా మనసక్షి ఒప్పుకోక వెళ్ళలేదు కనుకే మల్లా రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారన్నారు. పిచ్చి మల్లా రెడ్డిని ఓడగొట్టటానికే మేడ్చల్ జిల్లాలో తిరుగుతున్నా..MLA గా పోటీ చేస్తానని ఎక్కడ చెప్పలేదని తెలిపారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ బలోపేతం కోసం అధిష్టానం సూచన మేరకే పని చేస్తున్నానని..మంత్రి మల్లా రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడగొడతామని సవాల్ చేశారు. మల్లా రెడ్డి పిచ్చి చేష్షలు,పిచ్చి మాటలు మానుకోవాలని.. పిచ్చి మాల్లా రెడ్డిని ఓడగొట్టటానికి మా జంగన్న చాలు అంటూ చురకలు అంటించారు.