ఈ శాకాహారంతో క్యాల్షియం ని పొందండి..!

-

మీరు శాకాహారులా..? క్యాల్షియం ఎక్కువగా తీసుకోవాలని అనుకుంటున్నారా..? అయితే శాకాహారంలో క్యాల్షియం సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆహార పదార్థాలను కనుక మీరు డైట్ లో తీసుకుంటే ఖచ్చితంగా మీకు క్యాల్షియం అందుతుంది అయితే మరి ఇంక ఆలస్యం ఎందుకు క్యాల్షియం సమృద్ధిగా ఉండే శాకాహారం గురించి ఇప్పుడు మనం చూద్దాం.

క్యాల్షియం ఆరోగ్యానికి చాలా మంచిది ఇది ఎముకల్ని దృఢంగా ఉంచుతుంది. చర్మ ఆరోగ్యానికి కూడా కాల్షియం చాలా అవసరం. బ్లడ్ ప్రెషర్ ని రెగ్యులేట్ చేయడానికి కూడా ఇది ఎంతో బాగా ఉపయోగపడుతుంది.

చియా సీడ్స్:

చియా సీడ్స్ లో ఓమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. అదే విధంగా కాల్షియం కూడా ఇందులో ఉంటుంది. మీరు ఏమైనా సలాడ్స్, స్మూతీస్, ఓట్స్ వంటి వాటిని తయారు చేసుకుంటే పైన మీరు వీటిని వేసుకుని తీసుకోవచ్చు.

అంజీర్:

అంజీర్ లో కూడా కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. రెండు అంజీర్లలో 65 మిల్లీగ్రాముల కాల్షియం పొందొచ్చు. కాబట్టి డైట్ లో వీటిని కూడా తీసుకోండి.

సోయా బీన్స్:

సోయా బీన్స్ లో కూడా కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. కనుక క్యాల్షియం పొందాలనుకుంటే సోయాబీన్స్ ని మీ డైట్ లో తీసుకోవడం మంచిది.

కమలాలు:

కమలాలలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. అదేవిధంగా క్యాల్షియం కూడా ఉంటుంది ఒక మీడియం సైజు కమలా పండ్ల లో 55 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది.

ఆకుకూరలు:

పాలకూర మొదలైన ఆకుకూరల్లో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఆకుకూరలను కూడా మీ డైట్ లో ఎక్కువ తీసుకోండి.

బ్రోకలీ:

100 గ్రాములు బ్రోకలీ లో 40 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది దీనిని సూపర్ ఫుడ్ అనొచ్చు దీనిని కూడా మీరు మీ డైట్ లో తప్పకుండా తీసుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news