స్టేట్ బ్యాంక్: ఇలా ఇంట్లో వుండే యాభై వేలు లోన్ పొందొచ్చు…!

ఆర్ధిక ఇబ్బందుల తో ఇబ్బంది పడుతున్నారా..? లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారా..? అయితే మీకు మంచి వార్త. దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI సులభం గానే రుణాలు అందిస్తోంది. దీనితో మీకు డబ్బులు వస్తాయి అలానే సమస్య కూడా తొలగి పోతుంది. అయితే మరి దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..

ఇ-ముద్రా స్కీమ్ ద్వారా ఆన్‌లైన్ లోనే అర్హత కలిగిన వారికి ఎస్బీఐ రుణాలు అందిస్తోంది. దీని కోసం మీరు ఇంట్లో వుండే రుణం కోసం అప్లై చేసుకోవచ్చు. పైగా దీని కోసం మీకు ఏ డాక్యుమెంట్లు కూడా అవసరం లేదు. చిరు వ్యాపారం చేయాలని భావించే వారికి బ్యాంక్ ఈ రుణాలు అందిస్తోంది.

అయితే ఇ-ముద్రా లోన్ తీసుకోవాలని భావించే వారు కచ్చితంగా ఎస్‌‌బీఐలో సేవింగ్స్ ఖాతా తీసుకోవాలి. అలానే ఈ ఎకౌంట్ ఓపెన్ చేసి ఆరు నెలలు దాటి వుంటే రుణం పొందొచ్చు. రూ.50 వేల వరకు రుణం అయితే ఆన్‌లైన్‌లోనే తీసుకోవచ్చు. అంత కంటే ఎక్కువ అయితే బ్యాంక్ కి వెళ్ళాలి.

బ్యాంక్ వెబ్‌సైట్‌కు వెళ్లి ఇ-ముద్రా లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. మీరు లోన్ ఓకే అయితే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు మెసేజ్ వస్తుంది. ఇలా అప్లై చేసుకుంటే ఆధార్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, బిజినెస్ ప్రూఫ్, క్యాస్ట్ సర్టిఫికెట్ అవసరం పడతాయి.