హైదరాబాద్ లో కరోనాతో ఇద్దరు ఫార్మాసిస్టులు చనిపోయిన ఘటన కలకలం రేపుతోంది. దీంతో మెడికల్ షాపుల సిబ్బంది ఆందోళనలో ఉన్నారు. కరోనా రోగులు కరోనా పాజిటివ్ వచ్చినా సరే నేరుగా మెడికల్ షాపులకు వస్తున్నారని, అందుకే మెడికల్ షాప్ సిబ్బందిని ప్రంట్ లైన్ వర్కర్లుగా గుర్తించాలని కోరుతున్నారు. మాకు కూడా వ్యాక్సిన్ వేయాలని సిబ్బంది కోరుతున్నారు.
అయితే మరో పక్క వ్యాక్సిన్ కొరత రాష్ట్రంలో టీకాల కోసం ఎదురుచూస్తున్న వారిని ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటి వరకు నిరాటంకంగా కొనసాగిన టీకా ప్రక్రియ ఆదివారం నిలిచిపోవడంతో, తమకు వ్యాక్సిన్ అందుతుందో లేదోనని లబ్ధిదారులు అయోమయంలో ఉన్నారు. తొలుత టీకా అంటే అంతగా ఆసక్తి చూపనివారు కూడా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వ్యాక్సిన్ల కోసం ఎగబడటంతో దేశవ్యాప్తంగా వ్యాక్సిన్లకు కొరత ఏర్పడిందని అంటున్నారు.