మంచి నాణ్యమైన నిద్రని ఇలా పొందండి..!

-

ప్రతి రోజూ కనీసం 7 నుండి 9 గంటల పాటు నిద్ర పోవడం చాలా ముఖ్యం. ఆరోగ్యం బాగుండాలి అంటే మంచి నిద్ర కూడా ఉండాలి. మంచి నిద్ర వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అయితే చాలా మంది సరిగ్గా నిద్రపోరు. మంచి నాణ్యమైన నిద్ర వాళ్ళు పొందలేరు. అటువంటి వాళ్ళు ఈ టిప్స్ ని ఫాలో అయితే మంచిది. దీనితో నిద్ర బాగా పడుతుంది.

 

సరైన దిండు:

మీరు సరిగ్గా మంచి దిండుని సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మంచి నిద్ర పడుతుంది. ఒకవేళ కనుక మీరు మంచిగా నిద్రపోలేకపోతే ఒకసారి మీరు దిండుని మార్చి చూడండి. సరైన దిండు వల్ల నాణ్యమైన నిద్రని పొందొచ్చు.

స్లీపింగ్ పొజిషన్:

మీరు నిద్రపోయే పొజిషన్ కూడా చాలా ముఖ్యం. పొట్ట అనుకుని మీరు నిద్ర పోవడం మంచిది కాదు ఒక పక్క తిరిగి నిద్ర పోయినా మంచి నిద్ర పొందొచ్చు. కాబట్టి మీరు నిద్రపోయే పొజిషన్ కూడా చాలా ముఖ్యం.

మంచి పరుపు:

మీరు నిద్రపోయే పరుపు కూడా చాలా ముఖ్యం. మీరు నాణ్యమైన పరుపు మీద నిద్రపోతే నాణ్యమైన నిద్ర మీరు పొందొచ్చు. మీరు నిద్రపోయే వరకు సరిగ్గా లేకపోవడం వల్ల ఇబ్బందులు కూడా వస్తాయి. ముఖ్యంగా నడుము నొప్పి, భుజం నొప్పి వంటివి వస్తాయి. కాబట్టి మీరు నిద్రపోయే పరుపు కూడా చాలా ముఖ్యం గమనించండి.

లైట్లన్నీ ఆపండి:

చాలామంది పెద్దపెద్ద బ్రైట్ గా ఉండే లైట్లని వాడుతూ ఉంటారు. అయితే దాని వల్ల కూడా నిద్ర పట్టదు. మీరు నిద్రపోయే చోటు చాలా ప్రశాంతంగా ఎంతో రిలాక్స్ గా ఉండాలి కాబట్టి మంచిగా నిద్రపోవాలంటే తక్కువ వెలుతురు ఉండేటట్లు చూసుకోండి. కర్టెన్స్ తో మొత్తం కిటికీలు మూసేసి సింపుల్ గా చిన్న వెలుతురు ఉండే లైట్స్ ని మాత్రమే వేసుకోండి. ఇలా మీరు నాణ్యమైన నిద్ర పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version