అత్యవసరంగా డబ్బులు కావాలా..? అయితే ఇలా స్టేట్ బ్యాంక్ నుండి తీసుకోవచ్చు..!

-

దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ కస్టమర్ల కోసం ఎన్నో రకాల సేవలని అందిస్తోంది. వీటి వలన కస్టమర్లకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటోంది. ఒక్కోసారి ఆర్థికంగా బలంగా ఉన్నవారికి కూడా డబ్బు అందుబాటు లోకి రాకపోవచ్చు. అలాంటప్పుడు స్టేట్ బ్యాంక్ అందించే ఈ సర్వీస్ గురించి తెలుసుకోవాలి. పర్సనల్ లోన్‌తో పాటు కస్టమర్లకు చెందిన ఏదైనా ఆస్తిని తాకట్టుపెట్టుకొని కూడా బ్యాంకులు లోన్ ఇస్తాయి. లోన్‌ అగైనెస్ట్ ప్రాపర్టీ (P-LAP) ఆఫర్‌ చేస్తోంది స్టేట్ బ్యాంక్.

ఎస్‌బీఐ లో ప్రాపర్టీలపై లోన్‌ ని పొందాలంటే ఆస్తులు తనఖా పెట్టి లోన్‌ తీసుకోవచ్చు. పెద్ద మొత్తంలో ఫండ్స్‌ అవసరమైన వారు, సెక్యూరిటీగా ప్రాపర్టీని ఆఫర్‌ చేయడానికి సిద్ధంగా ఉన్న వారు తీసుకోచ్చు. కస్టమర్‌ ప్రాపర్టీ మార్కెట్‌ విలువలో కొంత భాగాన్ని లోన్‌గా ఇస్తుంది. ఒకవేళ లోన్‌ ని తిరిగి చెల్లించకపోతే రుణదాతకు సంబంధిత ప్రాపర్టీని స్వాధీనం చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్‌ అవసరాలు, మ్యారేజ్‌, మెడికల్‌ కేర్‌ వంటి వాటి కోసం దీన్ని తీసుకోవచ్చు.

అలానే ఈ LAP మాత్రమే కాకుండా, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా ప్రివిలేజ్ హోమ్ లోన్స్‌, శౌర్య హోమ్ లోన్స్‌, ట్రైబల్ ప్లస్, రెగ్యులర్‌ హోమ్‌ లోన్స్‌, హోమ్‌ టాప్-అప్ లోన్స్‌, బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్‌ ఆఫ్‌ హోమ్‌ లోన్స్‌, NRI హోమ్ లోన్స్‌, ఫ్లెక్సీపే హోమ్ లోన్స్‌ వంటివి కూడా ఇస్తోంది. రీపేమెంట్ సామర్థ్యాన్ని అంచనా వేసుకు తీసుకోవాలి. లోన్ రీపేమెంట్ చేయడంలో విఫలమైతే ప్రాపర్టీని జప్తు చేసుకునే ప్రాసెస్‌ మొదలు పెట్టచ్చు. ప్రాపర్టీని విక్రయించి బకాయి మొత్తాన్ని పొందవచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news