రాజీనామా లెటర్ సిద్ధంగా ఉంచుకో హరీశ్ రావు: సీఎం రేవంత్ రెడ్డి

-

ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు.’రైతు రుణమాఫీ చేస్తా.. రాజీనామా లెటర్ సిద్ధంగా ఉంచుకో’ అని ముఖ్యమంత్రి రేవంత్.. హరీశ్ రావుకు సవాల్ విసిరారు.గురువారం సాయంత్రం నీలం మధుకు మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…’హరీశ్.. పంద్రాగస్టు వరకే నీ ఆటలు. కొమురవెల్లి మల్లన్న సాక్షిగా ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తా అని హామీ ఇచ్చారు. పంద్రాగస్టు నాడు సిద్దిపేటకు స్వాతంత్య్రం రాబోతోంది. సిద్దిపేటను 45 సంవత్సరాల నుంచి పాపాల బైరవుల్లా మామ, అల్లుడు పట్టిపీడిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు.హరీశ్ రాజీనామా చేశాక కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తా’ అని సిద్దిపేట రోడ్ షోలో స్పష్టం చేశారు.

కాగా, సంగారెడ్డిలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 15 లోగా రుణమాఫీ, ఆరు గ్యారంటీలు అమలు చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అన్నారు. మళ్లీ తాను ఎన్నికల్లో పోటీ చేయను అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news