అకీరాకు తనకు ఎలాంటి సంబంధం లేదని పవన్ అన్నారా?..నిజం ఇదేనా?

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టార్ హీరోగా, రాజకీయ నేతగా మంచి పేరు ఉంది.. ఆయన మేనరిజమ్ నచ్చి యువత ఆయనకు అభిమానులుగా మారారు..పవన్ సినిమా వస్తుంది అంటే మాత్రం ఫ్యాన్స్ కు పూనకాలే..సినిమా మొదలైనప్పటి నుంచి బయటకు వచ్చి, వెళ్ళే వరకూ ఆ సినిమా ప్రమోషన్స్ ను సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో చేస్తారు.ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి తోటి హీరోలు కూడా ఆశ్చర్యపోతుంటారు.

తెలుగులోనే కాక ఇతర భాషలలోను పవన్‌కి విపరీతమైన క్రేజ్ ఉంది. అయితే పవన్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే మాత్రం కొంత విమర్శల పాలవుతున్నాడు.మూడు పెళ్లిళ్లు చేసుకున్న పవన్ ముగ్గురి జీవితాలని నాశనం చేశాడంటూ కొందరు ఆయనపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతుంటారు. సినీ నటి రేణూ దేశాయ్‌తో కొన్ని రోజులు డేటింగ్ చేసిన తర్వాత ఆమెను వివాహం చేసుకున్నాడు. వీరి దాంపత్యానికి గుర్తుగా అకీరా నందన్, ఆద్యా జన్మించారు. అయితే రేణూ దేశాయ్ నుండి విడిపోయిన తర్వాత కూడా పిల్లల బాధ్యతను పవన్ తీసుకుంటున్నాడు…

అకీరా అప్పుడప్పుడు తండ్రి, కుటుంబ సభ్యులను కలుసుకుంటారు..ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదువుతున్న అకీరా నందన్ ఇటీవల తన స్కూల్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకోగా, ఈ కార్యక్రమానికి రేణు దేశాయ్ తన కూతురుతో కలిసి రాగా… పవన్ కల్యాణ్ కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న అకీరా నందన్‌తో కలిసి పవన్‌, రేణు దేశాయ్‌, వారి కూతురు కలిసి ఓ ఫొటో దిగారు..ఆ ఫోటో నెట్టింట వైరల్ అయ్యింది.

ఇది ఇలా ఉండగా.. ఇప్పుడు ఓ వార్త సంచలనంగా మారింది..వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్ ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి షాకింగ్ నిజాన్ని వెల్లడించారు. యనమల నాగార్జున యాదవ్ మాట్లాడుతూ – “నేను అబద్ధాలు చెప్పడం లేదు. 2007 సెప్టెంబర్ 5వ తేదీ OP 590/ 2007 పిటీషన్ నంబర్‌ను చూడండి. పవన్ కళ్యాణ్‌ని ఫాలో అయ్యే ప్రతి ఒక్కరూ ఈ విషయం తెలుసుకోవాలి.

రేణుతో లివింగ్-ఇన్ రిలేషన్‌షిప్ ద్వారా కొడుకు పుట్టారా అని ప్రశ్నించినప్పుడు.. రేణు దేశాయ్‌తో , అకీరా నందన్‌తో సంబంధం లేదని పేర్కొన్నాడు. మరి 2004లో అకీరా ఎలా పుట్టాడు అని ప్రశ్నించారు..ఇది కాస్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది..దీనిపై పవన్ ఎప్పుడూ క్లారిటీ ఇస్తారో చూడాలి..

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version