నెయ్యి నూనెలా ఉంది.. టీటీడీ ఈవో సంచలన వ్యాఖ్యలు

-

గత రెండు, మూడు రోజుల నుంచి తిరుమల లడ్డూ ప్రసాదం వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ వివాదం పై పలువురు రాజకీయ నేతలు స్పందిస్తున్నారు. తాజాగా టీటీడీ ఈవో శ్యామల రావు మీడియాతో మాట్లాడారు. తిరుమలను భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. నెయ్యి నాణ్యత బాగాలేదని చాలా మంది భక్తులు ఫిర్యాదు చేశారు. తక్కువ రేటుకు నెయ్యిని తీసుకొచ్చి సరఫరా చేశారు. జంతువుల కొవ్వులు వాడుతున్నారనే ఫిర్యాదులు వచ్చాయి. లడ్డూ క్వాలిటీ బాగుండాలంటే.. నెయ్యి స్వచ్ఛమైనదిగా ఉండాలి.

 నెయ్యి నాసిరకంగా ఉందని కాంట్రాక్టర్లకు చెప్పాం. టీటీడీలో నెయ్యి టెస్టింగ్ కోసం సొంత ల్యాబ్ లేదు. బయటి ల్యాబ్ ల్లో టెస్టింగ్ చేయించలేదు.  రూ.75 లక్షలు ఖర్చు అయ్యే ల్యాబ్ ను గత ప్రభుత్వం ఎందుకు పెట్టలేదో తెలియదన్నారు ఈవో శ్యామల రావు. రూ.320కి కిలో నెయ్యి రాదని అందరూ చెబుతున్నదే తాము ఆ నెయ్యిని ల్యాబ్ టెస్టింగ్ ఇచ్చామని తెలిపారు. నెయ్యి నాణ్యత పై 39 రకాలుగా టెస్ట్ లు చేయించినట్టు తెలిపారు ఈవో. 

 

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version