హైదరాబాద్ వాసులకు జిహెచ్ఎంసి హెచ్చరిక..ఎవరూ బయటకు రావద్దు..!

భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యం లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిహెచ్ఎంసి అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో ఈ రోజు మధ్యాహ్నం నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యం లో ప్రజలు అత్యవసర పనులు ఉంటే తప్ప ఎవ్వరూ బయటకు వెళ్ళవద్దని జిహెచ్ఎంసి హెచ్చరించింది.

ఏమైనా ఇబ్బందులు ఎదురైనపక్షం లో జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయం లో ఏర్పాటు చేసిన సహాయక కేంద్ర నంబర్ 040-21111111 కు కాల్ చేయాలని ప్రజలకు సూచించింది. ఇదిలా ఉండగా నిన్న రాత్రి నుండి హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం పడటం తో ట్రాఫిక్ జామ్ తో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఇక లోతట్టు ప్రాంతాల్లోకి కూడా భారీగా వరద నీరు చేరుకుని ప్రజలు ఇబ్బందులు ఎదురుకుంటున్నారు.