మంత్రి హరీష్ రావు కారులో పోలీసుల సోదాలు

హుజురాబాద్‌ నియోజక వర్గ ఉప ఎన్నిక తేదీ తరుము కొస్తన్న తరుణంలో… ప్రధాన పార్టీలు అన్ని గెలుపు పై గురి పెట్టాయి. గెలుపే లక్ష్యంగా ప్రచారంలోనూ దూసుకు వెళుతున్నాయి అన్ని పార్టీలు. అటు హుజురాబాద్‌ నియోజక వర్గం ఉప ఎన్నిక నేపథ్యం లో ఎన్నికల కోడ్‌ కూడా అమలులోకి వచ్చింది. ఈ నేపథ్యం లో అధికార పార్టీ నేతల తో పాటు విపక్షాల నేతల పై పోలీసులు కన్నేశారు. నియోజక వర్గానికి వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణంగా తనిఖీలు చేస్తున్నారు.

ఈ తరుణంలో నే తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హారీష్‌ రావు వాహానాన్ని తనిఖీ చేశారు పోలీసులు. అయితే.. ఈ తనిఖీల్లో ఎలాంటి డబ్బు దొరకలేదని… పోలీసులు క్లీన్‌ చీట్‌ ఇచ్చారు. అటు మొన్న గంగుల కమలాకర్‌ వాహనాన్ని కూడా పోలీసులు తనిఖీ చేసిన సంగతి తెలిసిందే. కాగా.. హుజురాబాద్‌ నియోజక వర్గ ఉప ఎన్నిక ఈ నెల 30 వ తేదీన జరుగనుంది. అలాగే.. ఈ ఉప ఎన్నిక ఫలితాలు నవంబర్‌ 3 వ తేదీన వెలువడనున్నాయి.