గణేష్ నిమజ్జనంపై గందరగోళం….సుప్రీం కోర్టును ఆశ్రయించిన జీహెచ్ఎంసీ

-

ఢిల్లీ : గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని గణేష్‌ విగ్రహాల నిమజ్జనం పై తీవ్ర గందర గోళన నెలకొన్న సంగతి తెలిసిందే. ట్యాంక్‌ బండ్‌ లో విగ్రహాలను వేయొద్దని తెలంగాణ హై కోర్టు ఆదేశించగా.. సుప్రీం కోర్టు ఆశ్రయించింది తెలంగాణ సర్కార్‌. అయితే… తాజాగా వినాయక విగ్రహాల నిమజ్జనం పై సుప్రీం కోర్టును ఆశ్రయించింది “గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్” (జిహెచ్ఎంసి).

హుస్సేన్ సాగర్ లో వినాయక విగ్రహాల నిమజ్జనాన్ని నిరాకరిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేసింది జిహెచ్ఎంసి. జీహెచ్‌ ఎంసీ తరఫున కమిషనర్ లోకేష్ కుమార్ పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఒకటి రెండు రోజులలో సుప్రీం కోర్టు లో మెన్షన్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. వినాయక విగ్రహాల నిమజ్జనానికి అనుమతులు మంజూరు చేయాలని కోరుతూ పిటీషన్ దాఖలు చేసింది జిహెచ్ఎంసి. కాగా.. ఈ ఆది వారం రోజున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం గా వినాయక నిమజ్జనం జరుగ నుంది.

Read more RELATED
Recommended to you

Latest news