గ్రేటర్ వార్ : కోటి 40 లక్షల డబ్బు, 80 గ్రాముల డ్రగ్స్, 59 లీటర్ల మద్యం స్వాధీనం

జీహెచ్ఎంసీ ఎన్నికలకు  హైదరాబాద్ పోలీసులు సన్నద్ధం అయ్యారు. ఇప్పటికే హైదరాబాద్ సిటీలో 601 సమస్యాత్మక పోలింగ్ లొకేషన్ లు గుర్తించారు. 1704 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ లు గుర్తించారు. అలానే 307 అత్యంత సమస్యాత్మక పోలింగ్ లొకేషన్ లు గుర్తించి 1085 అత్యంత సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లుగా గుర్తించారు అధికారులు. సిటీ వ్యాప్తంగా 15 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు చెకింగ్ లు చేస్తున్నారు. ఇప్పటి వరకు 1167  రౌడీ షీటర్ ల బైండోవర్ చేశారు.

ఎన్నికల సందర్భంగా 3744 వెపన్స్ ను పోలీస్ స్టేషన్ లో డిపాజిట్ చేశారు నేతలు. ఎన్నికల నిబంధన ఉల్లంఘించిన  19 మంది నేతలపై కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు పోలీసుల తనిఖీల్లో 1 కోటి 40 లక్షల డబ్బు స్వాధీనం చేసుకున్నారు. 10 లక్షల రూపాయలు విలువ చేసే 80 గ్రాముల మత్తు పదార్థాలు స్వాధీనం చేస్తున్నారు. అలానే 59 లీటర్ల మద్యం కూడా స్వాధీనం చేసుకున్నారు.