తలసాని, దానం నాగేందర్ లపై ఫైన్ వేసిన జిహెచ్ఎంసి !

టిఆర్ఎస్ నేతలకు ఊహించని షాక్ ఇచ్చింది జిహెచ్ఎంసి. టిఆర్ఎస్ పార్టీ  ప్లీనరీ సందర్భం గా అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఫైన్ లు వేసింది జి హెచ్ఎంసి EVDM. గడచిన కొన్ని రోజులు గా సెంట్రల్ ఎన్ఫోర్స్మెంట్ సెల్ సర్వర్ డౌన్ ఉండటం కారణం గా ఫైళ్లను నిలిపి వేశారు అధికారులు. ఈ రోజు నుండి మళ్లీ ఫైళ్లను వేయడం ప్రారంభించారు జిహెచ్ఎంసి అధికారులు.

సర్వర్ డౌన్ కారణంగా టిఆర్ఎస్ నేతలకు ఫైన్ వేసింది జీహెచ్ ఎంసీ. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3 లో కటౌట్ ఏర్పాటు చేసిన టిఆర్ఎస్ ఎమ్యెల్యే దానం నాగేందర్ కు 30 వేల రూపాయలు ఫైన్ విధించగా.. మంత్రి తలసాని ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ కు 5000 ఫైన్ విధించింది జీహెచ్ ఎంసీ ఈ.వి.డి.ఎం. సరిగ్గా ప్లీనరీ టైం లో సెంట్రల్ ఎన్ఫోర్స్మెంట్ సెల్ సర్వర్ డౌన్ అయింది. దీనితో జిహెచ్ఎంసి ప్రకటించడం పై తీవ్ర విమర్శలు రాగా.. ఇప్పుడు పూర్తి స్థాయిలో పనిచేస్తుందా.. ? లేదా ? అనేది హాట్ టాపిక్ అయింది. కాగా అక్టోబర్ 25 వ తేదీన టిఆర్ఎస్ పార్టీ  ప్లీనరీ జరిగిన సంగతి తెలిసిందే.