హైదరాబాద్ లోని కూర్మగూడ డివిజన్ మాదన్నపేట్ బస్తీలో నాలుగు రోజుల క్రితం ఒక వ్యక్తికి కరోనా సోకడంతో అతన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో వ్యక్తి నివాసం వద్ద క్లస్టర్ ఏర్పాటు చేశారు. కానీ వారి కుటుంబ సభ్యులకు ఇంత వరకు ఎలాంటి టెంపరేచర్ చెక్ చేయలేదు. కానీ రెండు రోజులకు సరిపడ టాబ్లెట్స్ ఇచ్చారు. అప్పటి నుంచి వైద్య, బల్దియా అధికారులు అందుబాటులో లేరని బాధిత కుటుంబ సభ్యులు వాపోతున్నారు. నిత్యావసర మందులకు, కూరగాయలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని బాధితుని తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.