కరోనా లాక్ డౌన్ వలన ఆరేడు నెలలుగా డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు క్రమంగా రోడ్డెక్కుతున్నాయి. ఇప్పటికే తెలంగాణాలో అంతర్ జిల్లా బస్సు సర్వీసులు, జిల్లాలో బస్సు సర్వీసులు అందు బాటులోకి రాగా హైదరాబాద్ సిటీ బస్సులతో పాటు శివారు ప్రాంతాల్లో మాత్రం బస్సులు ప్రారంభానికి నోచుకోలేదు. ఈరోజు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఆర్టీసీ సబర్బన్, ముఫిసిల్ సర్వీసులు ప్రారంభమయ్యాయి.
ఈ రోజు తెల్లవారు జాము నుంచి బస్సు సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. 200 లకు పైగా ట్రిప్ లు వేసేలా బస్సులను గ్రేటర్ ఆర్టీసీ ప్రారంభించింది. అయితే సిటీలో నడిచే బస్సులపై ఆర్టీసీ ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రెండు మూడు రోజుల్లో ఈ విషయం మీద కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సిటీ సర్వీసులకు సంబంధించిన అన్ని బస్సు డిపోలలో ఇప్పటికే అలర్ట్ జారీ చేశారు ఆర్టీసీ ఉన్నతాధికారులు. డ్రైవర్లు, కండక్టర్లు సిద్ధంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేసారు.