ఇటీవలే విద్యుత్ బిల్లు విషయంలో తెలంగాణ మంత్రి హరీష్ రావు జగన్ పై చేసిన విమర్శలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కేంద్ర నాలుగు వేల కోట్లు ఇస్తామనేసరికి జగన్ రైతుల ప్రయోజనాలను తాకట్టుపెట్టి కేంద్రానికి మద్దతు ప్రకటిస్తున్నట్టు విమర్శలు చేశారు హరీష్ రావు. ఇక హరీష్ రావు వ్యాఖ్యలను సమర్ధిస్తూ జగన్ సర్కార్ పై ఏపీ ప్రతిపక్షాలు కూడా విమర్శలు చేస్తున్నాయి. టిడిపి నేత ఎరపతినేని శ్రీనివాసరావు ఇలాంటి తరహా విమర్శలు చేశారు.
తెలంగాణ మంత్రి హరీష్ రావు సీఎం జగన్ పై చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ జగన్ ఆత్మపరిశీలన చేసుకోవాలి సూచించారు ఎరపతినేని శ్రీనివాసరావు. నాలుగు వేల కోట్లకు ఆశపడి విద్యుత్ మీటర్లతో సీఎం జగన్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ ఉచ్చు బిగిస్తున్నారు అంటూ విమర్శించారు ఎరపతినేని. రైతుల విషయంలో వ్యవసాయ అభివృద్ధి విషయంలో జగన్ సర్కారు పూర్తిగా విఫలమైందని… అంతేకాకుండా మద్యనిషేధం పేరుతో సొంత లిక్కర్ పాలసీ తెచ్చి… పిచ్చి పిచ్చి బ్రాండ్లు ప్రజలకు అంటగడుతున్నారు అంటూ విమర్శలు గుప్పించారు.