దీపావళికి అందమైన బహుమతులను ఇవ్వాలనుకుంటున్నారా..? అయితే ఈ గిఫ్టింగ్ ఐడియాస్ చూడాల్సిందే..!

-

ఈ దీపావళి సందర్భంగా మీరు మీకు నచ్చిన వాళ్ళకి బహుమతులను ఇవ్వాలనుకుంటున్నారా..? అయితే ఈ గిఫ్ట్ ఐడియాస్ ను చూడండి. వీటిని కనుక మీరు ఫాలో అయ్యారంటే కచ్చితంగా మీరు ఇచ్చే బహుమతులు వాళ్లకి నచ్చుతాయి.

అరోమా డిఫ్యూజర్:

దీపావళికి అందరూ అందంగా ఇంటి అలంకరించుకుంటారు అలానే మంచి సువాసన వెదజల్లే అరోమా డిఫ్యూజర్స్ ని ఉపయోగిస్తూ ఉంటారు. ఆయిల్ లేదా అరోమా థెరపీ డిఫ్యూజర్ ని మీరు గిఫ్ట్ కింద ఇవ్వచ్చు ఎసెన్షియల్ ఆయిల్స్ ని గిఫ్ట్ కింద ఇవ్వడానికి బాగుంటుంది.

దేవుడి విగ్రహాలు:

దీపావళి సందర్భంగా మీరు మీకు నచ్చిన వాళ్ళకి అందంగా ఉండే శ్రీరాముని విగ్రహం కానీ వినాయకుడు, విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, కృష్ణుడు వంటి దేవుడి విగ్రహాలని బహుమతి కింద ఇవ్వచ్చు లేదంటే మీరు మంచి పెయింటింగ్ ఉండే వాటిని కూడా ఇవ్వచ్చు.

మంచి శబ్దాన్ని ఇచ్చే గంటలు:

చాలామంది దేవుడు గదిలో అందమైన శబ్దం వచ్చే గంటలను పెడతారు దీనిని అయినా మీరు గిఫ్ట్ కింద ఇవ్వొచ్చు.

మొక్కలు:

మొక్కలు ఎన్ని ఉన్నా అందరూ మొక్కలు ఇష్టపడుతూ ఉంటారు మీరు బహుమతి కింద మొక్కల్ని కూడా ఇవ్వొచ్చు. ఇండోర్ ప్లాంట్స్ ను కూడా చాలా మంది ఎక్కువగా ఇళ్లల్లో పెడుతున్నారు. వీటిని అయినా మీరు బహుమతి కింద ఇవ్వొచ్చు.

హోమ్ మేడ్ చాక్లెట్ లేదా స్వీట్స్:

మంచి రుచికరమైన హోమ్ మేడ్ చాక్లెట్ ని బహుమతి కింద ఇవ్వచ్చు లేదంటే మీరు స్వీట్స్ ని అయినా బహుమతిగా ఇవ్వచ్చు ఇలా మీరు ఈ బహుమతుల్ని ప్రజెంట్ చేశారు అంటే కచ్చితంగా వాళ్లకి నచ్చుతాయి.

ఈ ఏడాది పండుగ ఎప్పుడు వచ్చింది అనేది చూస్తే.. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది దీపావళి అక్టోబర్ 24న వచ్చింది. అయితే అక్టోబర్ 25న సాయంత్రం 5.11 గంటల నుంచి 6.27 గంటల వరకు సూర్య గ్రహణం ఉంటుందిట. అమావాస్య వెళ్లిపోయి పాడ్యమి వస్తుందని.. దీని మూలంగా అమావాస్య ఉండదు. కనుక 24న రాతంత్రా అమావాస్య గడియలు వున్నాయి కనుక దీపావళి అక్టోబర్ 24న అయ్యింది. ఆ రోజు పండుగ చేసుకోవాలి. పండితులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news