ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముగిసిన వెంటనే T20 ప్రపంచకప్ మొదలవనుందన్న విషయం తెలిసిందే.జూన్ 2 నుంచి 29 వరకూ జరిగే మెగా టోర్నీ కి అమెరికా, వెస్ట్ ఇండీస్ ఆథిత్యం ఇవ్వనున్నాయి. ఈ టోర్నీ కోసం ఇప్పటికే అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు.ఇదిలా ఉంటే…టీ20 వరల్డ్ కప్ జట్టును బీసీసీఐ ఎంపిక చేసింది.
ఈ జట్టులో యంగ్ ఓపెనర్ శుభ్మన్ గిల్కు చోటు దక్కకపోవడంపై మాజీ కోచ్ రవిశాస్త్రి నిరాశ వ్యక్తం చేశారు. ‘ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆడగలిగే సామర్థ్యం ఉన్న ప్లేయర్ గిల్. కానీ ఆ టాలెంటెడ్ క్రికెటర్కు జట్టులో చోటు దక్కలేదు. ఈ ఎదురుదెబ్బను జీర్ణించుకోవడం అతనికి కష్టంగా ఉంటుంది. కచ్చితంగా బాధపడుతూ ఉంటాడు. దీన్ని పాజిటివ్ గా తీసుకుని మరింత మెరుగుపడేందుకు గిల్ ప్రయత్నించాలి’ అని రవి శాస్త్రి సూచించారు.కాగా, ప్రపంచకప్ జట్టులో కెప్టెన్ గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యాను సెలెక్ట్ చేసింది బీసీసీఐ.