అల్లం సాగు చేస్తున్నారా..? అయితే ఎక్కువ లాభాలిచ్చే రకాల గురించి చూడండి..!

-

దేశవ్యాప్తంగా అల్లానికి ఏడాది పొడవునా కూడా స్థిరమైన ధర ఉంటుంది. మనకి సంవత్సరం పొడవునా కూడా అల్లం ఉపయోగపడుతుంది. అధిక విస్తీర్ణం లో అల్లం పంటను సాగు చేస్తే మంచిగా లాభాలను పొందవచ్చు. అయితే అల్లం పంట సాగు చేయడానికి పెట్టుబడి ఎక్కువ పెట్టాలి కానీ ఆదాయం కూడా ఎక్కువగానే వస్తుంది.

వేడితో కూడిన అధిక తేమ ఉన్న వాతావరణం ఈ సాగు చేయడానికి అనుకూలం. నీరు నిలిచే బంకమట్టి నేలల్లో దీనిని సాగు చేస్తే కుళ్లిపోతుంది. దీంతో తీవ్ర నష్టం వస్తుంది. అల్లం సాగు లో ఎక్కువ పెట్టుబడి విత్తన దుంపలను కొనాలంటే ఎక్కువ ఖర్చు అవుతుంది.

విత్తనం కోసం దాదాపు ఐదు వేల నుంచి పది వేలు ఖర్చు చేయాలి. ఎకరానికి ఎనిమిది నుంచి పది క్వింటాళ్ల విత్తనం కావాలి. అంటే 60వేల వరకు విత్తనాల కి ఖర్చు పెట్టాలి. ఇక అల్లం సాగు చెయ్యాలంటే ఏ రకం అల్లం బాగుంటుంది..?, ఏ రకం అల్లం వేస్తె మంచిగా లాభాలు వస్తాయి అనేది చూద్దాం.

సిద్దిపేట రకం: తెలంగాణా ప్రాంతానికి ఇది బాగా అనువైనది. పంటకాలం 210 రోజులు ఉండి,ఎకరాకు అత్యధికంగా 12 టన్నుల అల్లం దిగుబడిని ఇస్తుంది.
రియో-డి-జినైరో: ఎక్కువ తేమ శాతం కలిగి ఉంటుంది ఇది. పంట కాలం 190 రోజులు ఉంటుంది. ఎకరాకు 8-9 టన్నులు దిగుబడినిస్తుంది.
మారిస్ అల్లం: తక్కువ పీచు ఉండి ఎక్కువ శాతం నూనె మరియు ఓలియోరెసిన్ ఉంటుంది. పంటకాలం 200 రోజులు. ఇది ఎకరాకు 10 టన్నుల అల్లం దిగుబడినిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news