మెగాస్టార్ గాడ్ ఫాద‌ర్ మూవీ నుంచి అప్‌డేట్!

-

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న కొత్త సినిమా గాడ్ ఫాద‌ర్. ఈ సినిమా మ‌ల‌యాళంలో మోహన్ లాల్ న‌టించిన లూసిఫ‌ర్ కు రీమేక్. అయితే ఈ సినిమా నుంచి తాజా గా కొత్త అప్ డేట్ వ‌చ్చింది. ఈ సినిమాలోఎ ఒక కీల‌క పాత్ర‌లో బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనటానికి స‌ల్మాన్ ఖాన్ త్వ‌ర‌లో షూటింగ్ బృందంతో క‌లుస్తాడ‌ని తెలుస్తుంది. అలాగే ఈ సినిమాకు స‌ల్మాన్ ఖాన్ కూడా వారం రోజుల షెడ్యూల్ కేటాయించాడాని స‌మాచారం.

ఈ వారం రోజుల్లోనే సల్మాన్ ఖాన్ పాత్ర షూటింగ్ పూర్తీ చేయాల‌ని చిత్ర బృందం కూడా ప్లాన్ చేస్తుంది. అయితే స‌ల్మాన్ ఖాన్ ప్ర‌స్తుతం త‌న టైగ‌ర్ 3 సినిమా షూటింగ్ లో ఉండాల్సింది. కానీ క‌రోనా కార‌ణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా ప‌డింది. దీంతో ఇప్పుడు ఉన్న ఖాళీ స‌మ‌యాన్ని గాడ్ ఫాద‌ర్ కు కేటాయించాల‌ని సల్మాన్ ఖాన్ కేటాయించినట్టు స‌మాచారం. కాగ మ‌ల‌యాళం లో వ‌చ్చిన లూసిఫ‌ర్ సినిమాలో పృథ్వీ రాజ్ సుకుమార‌న్ న‌టించిన పాత్ర ను స‌ల్మాన్ ఖాన్ పోషిస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news