‘జియోనీ ఎఫ్‌ 9’ ప్లస్ సూప‌ర్‌ ఫీచర్లు ఇవే.. 7వేలకే అదిరిపోయే ట్రెండీ ఫోన్‌

-

జియోనీ తన సరికొత్త స్మార్ట్ ఫోన్ ను జియోనీ ఎఫ్9 ప్లస్ పేరుతో భారత్ మార్కెట్ లోకి విడుదల చేసింది. జియోనీ ఎఫ్ 9 ప్లస్ త్వరలో కంపెనీ భాగస్వామి రిటైలర్లతో పాటు ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా అమ్మకం కానుంది. జియోనీ ఎఫ్ 9 ప్లస్‌తో పాటు, వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్, వైర్డ్ హెడ్‌ఫోన్స్ మరియు పవర్ బ్యాంక్‌లను కలిగి ఉన్న జిబిడి శ్రేణి ఉపకరణాలను కూడా దేశంలో విడుదల చేసింది.

జియోనీ ప్రకారం, ఎఫ్ 9 ప్లస్ రెండు కలర్ ఆప్షన్లలో ల‌భిస్తుంది. జియోనీ ఎఫ్ 9 స్మార్ట్ ఫోన్ రూ. 7,690 కు ల‌భిస్తుంది. స్పెసిఫికేషన్ల పరంగా.. ఈ ఫోన్ 6.26-అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్ల్పేతో వస్తుంది. జియోనీ ఎఫ్ 9 ప్లస్ 1.65GHz ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది 3 జీబీ ర్యామ్‌తో వస్తుంది. ఇది 4,050 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో పనిచేస్తుంది.

కెమెరాల విషయానికొస్తే, వెనుక వైపున ఉన్న జియోనీ ఎఫ్ 9 ప్లస్ 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, రెండొవది 2 మెగాపిక్సెల్ కెమెరాను ప్యాక్ చేస్తుంది. ఇది సెల్ఫీల కోసం ముందు భాగంలో 13 మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంది. జియోనీ ఎఫ్ 9 ప్లస్‌లోని కనెక్టివిటీ ఎంపికలలో వై-ఫై మరియు జిపిఎస్ ఉన్నాయి. ఫోన్‌లోని సెన్సార్లలో యాక్సిలెరోమీటర్ ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news