హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక‌: టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ అభ్య‌ర్థులు ఫిక్స్‌..!

-

తెలంగాణ‌లో గ‌త కొద్ది రోజులుగా వ‌రుస‌పెట్టి ఎన్నిక‌ల మీద ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఈ క్ర‌మంలోనే ఈ ఎన్నిక‌ల ప‌రంప‌ర‌కు కొద్దిగా గ్యాప్ వ‌చ్చింది అనుకుంటున్న టైంలో మ‌రో ఉప ఎన్నిక‌తో అక్క‌డ రాజ‌కీయం హీటెక్క‌నుంది. టీ పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేసిన హుజూర్‌న‌గ‌ర్ సీటుకు త్వ‌ర‌లోనే ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. గ‌త డిసెంబ‌ర్ ఎన్నిక‌ల్లో ఉత్త‌మ్ ఇక్క‌డ నుంచి వ‌రుస‌గా మూడోసారి విజ‌యం సాధించారు. ఇటీవ‌ల జ‌రిగిన లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఆయ‌న న‌ల్ల‌గొండ నుంచి ఎంపీగా గెల‌వ‌డంతో హుజూర్‌న‌గ‌ర్ సీటుకు రాజీనామా చేశారు.

ఇప్పుడు ఇక్క‌డ జ‌రిగే ఉప ఎన్నిక మూడు ప్ర‌ధాన పార్టీల‌కు కీలకంగా మారింది. అటు అధికార పార్టీ కావ‌డంతో టీఆర్ఎస్ ఉప ఎన్నిక‌ల్లో గెలిచి స‌త్తా చాటుకోవ‌డంతో పాటు అనేక ప్ర‌శ్న‌ల‌కు ఆన్స‌ర్ ఇవ్వాల‌నుకుంటోంది. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఓట‌మికి ఆన్స‌ర్ చేయ‌డం… ఇటు ఉత్త‌మ్‌కు, కాంగ్రెస్ చెక్ పెట్టాల‌న్న‌దే టీఆర్ఎస్ ప్లాన్‌. పైగా ఉప ఎన్నిక‌ల్లో గెల‌వ‌డం టీఆర్ఎస్‌కు మంచినీళ్లు తాగినంత స‌లువు.

ఇక కాంగ్రెస్‌కు ఇది సిట్టింగ్ సీటు… ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి పీసీసీ అధ్య‌క్షుడిగా ఉండి రాజీనామా చేయ‌డంతో ఈ సీటు గెలుచుకోవ‌డం ఆ పార్టీకి పెద్ద స‌వాల్‌. ఇక తెలంగాణ‌లో పాగా వేయాల‌ని చూస్తోన్న బీజేపీ ఇక్క‌డ గెలిచి ఉప ఎన్నిక‌ల జోరు కంటిన్యూ చేయాల‌ని చూస్తోంది. ఇక మూడు పార్టీలు ఇక్క‌డ ఎవ‌రిని పోటీ చేయించాల‌నే అంశంలో ఓ క్లారిటీకి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది.

కాంగ్రెస్ నుంచి సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి జానారెడ్డిని అడ‌గ‌గా ఆయ‌న తిర‌స్క‌రించ‌డంతో కోదాడ మాజీ ఎమ్మెల్యే, ఉత్త‌మ్ స‌తీమ‌ణి ప‌ద్మావ‌తి పేరు లైన్లో ఉంది. ఇక ఉత్త‌మ్ స‌న్నిహితుడు గూడూరు నారాయ‌ణ‌రెడ్డి పేరు ప‌రిశీలిస్తున్నారు. ఉత్త‌మ్ భార్య ప‌ద్మావ‌తి వైపే మొగ్గు ఉంది. ఆయ‌న కాదంటేనే మ‌రో వ్యక్తికి ఇక్క‌డ ఛాన్స్ ఉంటుంది. టీఆర్ఎస్ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో ఓడిన ఎన్నారై శానంపూడి సైదిరెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు. లోక‌ల్ కావ‌డం, గ‌త ఎన్నిక‌ల్లో గ‌ట్టి పోటీ ఇవ్వ‌డంతో సైదిరెడ్డికే ఛాన్సులు ఉన్నాయి.

ఇక బీజేపీ నుంచి ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా కాంగ్రెస్ రెబ‌ల్‌గా ఉన్న మునుగోడు ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి స‌తీమ‌ణి ల‌క్ష్మి పేరు తెర‌మీద‌కు వ‌చ్చింది. ఆమె ఇటీవ‌ల న‌ల్ల‌గొండ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఓడారు. రాజ్‌గోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌తో అంటీముట్ట‌న‌ట్టు ఉంటూ బీజేపీ వైపు చూస్తున్నారు. ఈ మూడు పార్టీల నుంచి ముగ్గురు బ‌ల‌మైన అభ్య‌ర్థులు రంగంలో ఉంటే హుజూర్‌న‌గ‌ర్ పోరు మంచి ర‌స‌వత్త‌రంగా ఉంటుంది.

తెలంగాణ‌లో త్వ‌ర‌లో జ‌రిగే హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక మూడు ప్ర‌ధాన పార్టీల‌కు కీల‌కంగా మారింది. గ‌త డిసెంబ‌ర్‌లో ఇక్క‌డ జ‌రిగిన ఎన్నిక‌ల్లో పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి గెలిచారు. ఈ యేడాది స‌మ్మ‌ర్‌లో జ‌రిగిన లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఆయ‌న న‌ల్ల‌గొండ నుంచి లోక్‌సభ‌కు ఎన్నిక‌వ్వ‌డంతో ఆయ‌న ఈ స్థానానికి రాజీనామా చేయ‌డంతో ఇక్క‌డ ఉప ఎన్నిక అనివార్య‌మైంది. త్వ‌ర‌లోనే కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఈ ఉప ఎన్నిక‌కు నోటిఫికేష‌న్ జారీ చేయ‌నుంది. దీంతో హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక తెలంగాణ పాలిటిక్స్‌ను హీటెక్కిస్తోంది.

ఇక ప్ర‌ధాన పార్టీలు ఇక్క‌డ నుంచి ఎవ‌రెవ‌రిని పోటీ చేయించాల‌నే అంశంపై ఇప్ప‌టికే క‌స‌ర‌త్తులు ప్రారంభించాయి. కాంగ్రెస్ సిట్టింగ్ సీటు కావ‌డం, పైగా టీపీసీసీ అధ్య‌క్షుడు ప్రాథినిత్యం వ‌హిస్తోన్న సీటు కావ‌డంతో ఇక్క‌డ గెలుపు ఆ పార్టీకి ప్ర‌తిష్టాత్మ‌కం. ఇక అధికార టీఆర్ఎస్ ఇక్క‌డ గెలిచి ఉత్త‌మ్‌కు షాక్ ఇవ్వాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉంది. గ‌త శానససభ ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిపై 7 వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధించారు. అయితే లోక్‌సభ ఎన్నిక‌ల‌కు వ‌చ్చేస‌రికి కాంగ్రెస్ మెజార్టీ మ‌రింత పెరిగింది.

ఇక కాంగ్రెస్ నుంచి ముందుగా సీనియ‌ర్ నేత జానారెడ్డిని పోటీ చేయ‌మ‌ని కోర‌గా ఆయ‌న తిర‌స్క‌రించార‌ట‌. ఇక ఉత్త‌మ్ స‌తీమ‌ణి, కోదాడ మాజీ ఎమ్మెల్యే ప‌ద్మావ‌తి పేరుతో పాటు ఉత్త‌మ్ స‌న్నిహితుడు గూడూరు నారాయ‌ణ‌రెడ్డి పేరు ప‌రిశీలిస్తున్నారు. చివ‌ర‌గా ప‌ద్మావ‌తి పేరు ఫైన‌లైజ్ అవ్వ‌వ‌చ్చ‌ని అంటున్నారు. ఇక ఈ ఎన్నిక‌ను కేటీఆర్ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకోవ‌డంతో అన్ని విధాలా బ‌ల‌మైన అభ్య‌ర్థి కోసం అన్వేష‌ణ జ‌రుగుతోంది.

ప్రస్తుతం ఎన్నారై శానంపూడి సైదిరెడ్డినే టీఆర్ఎస్ పోటీకి దించే అవకాశాలున్నాయి. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు. లోక‌ల్ నేప‌థ్యంలో సైదిరెడ్డికే సీటు వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువుగా ఉన్నాయంటున్నారు. ఇక తెలంగాణ‌లో ఏ అవ‌కాశం వ‌చ్చినా పాగా వేయాల‌ని చూస్తున్న బీజేపీ అనూహ్యంగా బ‌ల‌మైన అభ్య‌ర్థిని ఇక్క‌డ రంగంలోకి దించ‌నున్న‌ట్టు తెలుస్తోంది.

ఆ అభ్య‌ర్థి ఎవ‌రో కాదు ప్ర‌స్తుతం కాంగ్రెస్ రెబ‌ల్‌గా ఉన్న మునుగోడు ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి స‌తీమ‌ణి ల‌క్ష్మి. ఆమె ఇటీవ‌ల జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఓడిపోయారు. రాజ్‌గోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌తో అంటీముట్ట‌న‌ట్టు ఉంటూ బీజేపీ వైపు చూస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆమెను అక్క‌డ పోటీ చేయిస్తే అన్ని విధాలా బ‌ల‌మైన అభ్య‌ర్థి అవుతార‌ని బీజేపీ భావిస్తోంది. బీజేపీ అభ్య‌ర్థిగా ల‌క్ష్మి పోటీ చేస్తే హుజూర్‌న‌గ‌ర్ పోరు మూడు ముక్క‌లాట‌గా మారుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news