ఇంట్లో పిల్లిని పెంచుకోవడం వల్ల కలిగే లాభాలు తెలుసా…?

-

మనలో చాలామంది ఇంట్లో పెంపుడు జంతువులుగా కుక్క లేదా పిల్లిని పెంచుకుంటూ ఉంటారు. ఎక్కువ మంది కుక్కను పెంచుకుంటే కొందరు మాత్రం పిల్లిని పెంచుకోవడంపైనే ఆసక్తి చూపుతారు. తాజాగా ఒక చిన్నారి తనకు పిల్లిని కొనివ్వాలని తల్లిదండ్రులకు చెప్పడానికి ఏకంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (పీపీటీ)ను రూపొందించింది. ట్విట్టర్ లో వైరల్ అయిన అయిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఏకంగా సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ నే మెప్పించింది.

పూర్తి వివరాల్లోకి వెళితే కెనడాలోని ఒంటారియో ప్రాంతానికి చెందిన క్రిస్టోఫర్ డోయల్ అనే వ్యక్తి కూతురు తనకు పిల్లిని కొనివ్వాలని… పిల్లి వల్ల కలిగే లాభాలను ఒక జాబితాగా రూపొందించింది. డోయల్ కూతురు పీపీటీలో పిల్లి చూడటానికి చాలా క్యూట్ గా ఉంటుందని… పిల్లిని బయటకు తీసుకెళ్లి తిప్పాల్సిన అవసరం కూడా ఉండదని…. పిల్లి మన స్ట్రెస్ లెవెల్స్ ను సైతం సులభంగా తగ్గిస్తుందని పేర్కొంది.

పిల్లి మనల్ని ఎంతో సంతోషంగా ఉంచుతుందని… పిల్లిని ఏ విధంగా జాగ్రత్తగా చూసుకోవాలో ఐదు సంవత్సరాల నుంచి రీసెర్చ్ చేసి తెలుసుకున్నానని… తనకు పిల్లిని కొనిస్తే జాగ్రత్తగా చూసుకుంటానని తెలిపింది. తనకు పిల్లిని కొని ఇచ్చి తన జీవితంలో ఒక సంతోషకరమైన రోజును ఇస్తారని ఆశిస్తున్నానని చిన్నారి పేర్కొంది. చిన్నారి తండ్రి డోయల్ ట్విట్టర్ లో ఈ పీపీటీని షేర్ చేయగా మైక్రోసాఫ్ట్ ‘బలవంతపెట్టే పీపీటీ! మమ్మల్ని కూడా ఒప్పించేసింది’ అంటూ కామెంట్ చేయడం గమనార్హం. ట్వీట్ వైరల్ అవుతున్న నేపథ్యంలో డోయల్ త్వరలో తన కూతురికి పిల్లిని కొనిస్తానని చెప్పడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news