బ్రేకింగ్: విషమంగానే ఎస్పీ బాలూ ఆరోగ్య పరిస్థితి…?

-

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది అని ఎమ్జీఎం ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. ఆయన ఇంకా శ్వాస సంబంధిత వ్యాధితో బాధ పడుతున్నారు అని, వెంటిలేటర్ పై ఆయన కు చికిత్స అందుతుంది అని వైద్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిని ప్రముఖ వైద్య బృందం పర్యవేక్షిస్తుంది అని వెల్లడించారు.

ఇటీవల కరోనా బారిన పడి ఆయన ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. అక్కడి నుంచి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. గత శుక్రవారం ఆయన ఆరోగ్యం విషమంగా మారింది. అక్కడి నుంచి ప్లాస్మా చికిత్స కూడా చేసారు. అయినా సరే ఆయన ఆరోగ్యం మాత్రం ఇంకా మెరుగుపడలేదు. ప్రస్తుతం ఆయన కోసం ఢిల్లీ నుంచి వైద్య బృందం వచ్చే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news