అమ్మాయిలూ బీ అలర్ట్..ఈ తప్పులు చేశారో అంతే సంగతి..జాగ్రత్త..

-

అందాన్ని మెరుగులు దిద్దుకోవడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు. మాములుగానే వాళ్ళు రెడీ అవ్వడానికి చాలా టైం తీసుకుంటారు. ఇక ఫంక్షన్స్ వస్తే మాత్రం ఇక చెప్పనక్కర్లేదు ..గంటలు రెడీ అవుతారు..అమ్మాయిలు మేకప్ వేసుకుని, అందంగా, స్పెషల్ అట్రాక్షన్‌గా ఉండేలా రెడీ అవుతారు.అమ్మాయి జీవితంలో ముఖ్యమైన సందర్భాలు రెండుంటాయి. అవి నిశ్చితార్థం, వివాహం. ఒకరి జీవిత భాగస్వామిగా అఫిషియల్‌గా మారడానికి  అమ్మాయిలకు ఇది చాలా స్పెషల్. ఈ సందర్భంగా అమ్మాయిలు అందంగా కనిపించేలా ముస్తాబవుతుంటారు. అయితే, కొందరు అమ్మాయిలు నిశ్చితార్థం వేళ కొన్ని తప్పులు చేస్తుంటారు. ఫలితంగా వారు నిరాశకు గురవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. వారు పొరపాట్ల కారణంగా లుక్ పాడైపోతుంది. ఇలా జరుగకుండా ఉండేందుకు ఇవాళ మనం కొన్ని టిప్స్ తెలుసుకుందాం..

*. రెండు మూడు రోజుల ముందే ఫేషియల్ చేయించాలి. డీప్ క్లీనింగ్ కారణంగా ముఖంపై మొటిమలు, ఎరుపు దద్దుర్లు కనిపిస్తాయి. అలాంటి పరిస్థితుల్లో రెండు మూడు రోజుల ముందే ఫేషియల్ చేయించుకోవడం వల్ల ఫంక్షన్ టైమ్‌కి ముఖం సాధారణ స్థితికి చేరుతుంది. అదే రోజు ఫేషియల్ చేయించుకుంటే.. ముఖంపై మచ్చలు, మొటిమలు, దద్దుర్లు కనిపిస్తాయి.

*. హోమ్ రెమిడీస్‌ ప్రయోగాలు చేస్తారు. కానీ, అలా చేయొద్దు. ఫంక్షన్ రోజున వంటింటి చిట్కాలు అస్సలు ప్రయత్నించొద్దు. ఏదైనా ప్రతిచర్య జరిగితే.. దాని ప్రభావం ముఖంపై చాలా స్పష్టం కనిపిస్తుంది.దాన్ని ఎంత కవర్ చేసినా కనిపిస్తుంది.

*. కొత్త ప్రోడక్ట్స్ ట్రై చేస్తారు. కానీ, అలా చేయడం వల్ల ముఖారవిందం పాడయ్యే ప్రమాదం ఉంది. అందుకే మొదటి నుంచి ఉపయోగిస్తున్న స్కిన్ టోన్ ఫౌండేషన్ మొదలైన ప్రోడక్ట్స్‌నే వాడాలి. లేదంటే.. స్కిన్ టోన్‌లో తేడాలు కనిపిస్తాయి.

*. శరీరం, ముఖం ఒకే టోన్‌లో ఉండటానికి కారణం.. ముఖానికి వేసే మేకప్‌ను శరీరానికి కూడా వేస్తారు. దాని కారణంగానే ముఖం, మెడ, చేతులు, ఇలా శరీరం అంతా ఒకే టోన్‌లో కనిపిస్తుంటుంది. మేకప్ విషయంలో ఇలాంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి..

*. డ్రెస్, ఈవెంట్ ప్రకారం హెయిల్ స్టైల్‌ను సెలక్ట్ చేసుకోవాలి. అయితే, చాలా మంది సెలబ్రిటీల హెయిర్ స్టైల్స్‌ని ఫాలో అవుతుంటారు. అలా చేయొద్దు. హెయిర్ స్టైల్ స్టైలీష్‌గా ఉండటమే కాకుండా.. మీ ముఖానికి కూడా సూట్ అయ్యే విధంగా సెట్ చేయించుకోవాలి..లేదంటే ఏదో కోల్పోయినట్లు కనిపిస్తారు..

 

Read more RELATED
Recommended to you

Latest news