దడదడలాడిస్తున్న నయనతార ‘కనెక్ట్‌’ ట్రైలర్‌..

-

మరో లేడీ ఓరియంటెడ్ సినిమా ‘కనెక్ట్’తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది నయనతార. నయనతారతో గతంలో ‘మాయ (తెలుగులో మయూరి)’, తాప్సీతో ‘గేమ్ ఓవర్’ సినిమాలు రూపొందించిన అశ్విన్ శరవణన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. హార్రర్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వాన ఫేమ్ వినయ్ రాయ్, సత్యరాజ్, అనుపమ్ ఖేర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాను రౌడీ పిక్చర్స్ బ్యానర్‌పై నయనతార స్వయంగా నిర్మిస్తుంది. తెలుగులో ప్రముఖ యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను విడుదల చేయనున్నారు. డిసెంబర్ 22వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ట్రైలర్ విషయానికి వస్తే… కరోనా వైరస్ కారణంగా విధించిన నేషనల్ వైడ్ లాక్ డౌన్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కిందని తెలుస్తోంది. నయనతార, తన భర్తకి కరోనా వైరస్ సోకుతుంది.

CONNECT- Official Tamil Trailer| Nayanthara |Anupam Kher|Sathyaraj| Vignesh  Shivan |Ashwin Saravanan - YouTube

ఆ తర్వాత కథ హార్రర్ టర్న్ తీసుకుంటుంది. ఒక డిఫరెంట్ హర్రర్ సినిమాను చూడబోతున్నామని ట్రైలర్ ద్వారానే దర్శక నిర్మాతలు తెలిపారు. పరిమిత బడ్జెట్‌లోనే తెరకెక్కినప్పటికీ సినిమా క్వాలిటీ పరంగా, టెక్నికల్‌గా చాలా బాగుంది. ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ ఇప్పటికే పూర్తయ్యింది. U/A సర్టిఫికేట్ పొందింది. హార్రర్ సీన్లు సీట్ ఎడ్జ్‌లో కూర్చొబెట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ఓ ఆసక్తికర విషయం ఉంది. అదేంటంటే, మొత్తం సినిమా రన్ టైమ్ 99 నిమిషాలు. అయితే, ఇందులో బ్రేక్ ఉండదట. తొలిసారి ఇంటర్వెల్ బ్రేక్ లేకుండా ఓ ప్రయోగం చేయబోతున్నట్లు విఘ్నేష్ శివన్ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news