అందంగా ఉండాలని అని అనుకుంటే సరిపోదు.. మన వంతు ప్రయత్నం కూడా మనం చేయాలి.. పుట్టకతోనే ఎవరూ అందంగా ఉండరు. ఏదో కాస్త కలర్ ఎక్కువతో పుట్టవచ్చేమో కానీ. సరైన పద్దతులు పాటించకపోతే ఎంత తెల్లగా ఉన్నా ముఖంలో జీవకళ ఉండదు. అందం అసలే ఉండదు. ఇప్పుడు చెప్పుకోబోయే ఈ బ్యూటీ టిప్స్ అమ్మాయిలు మీకే.. ఫాలో అయితే రిజల్ట్ బాగుంటుంది.. ఇంకెందుకు లేట్ షురు చేసేయండి..!
చన్నీటితో అప్పుడప్పుడూ ముఖాన్ని కడుక్కుంటూ ఉండడం వల్ల చర్మానికి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ముఖ చర్మాన్ని బిగుతుగా, మెరిసేలా చేస్తుంది. రోజుకు రెండు మూడు సార్లు చేయటం మంచిది. ముఖం కడిగేందుకు ఎక్కువ సార్లు సబ్బు ఉపయోగించవద్దు.
ముఖం ఉబ్బినట్లుగా కనిపించినా, మొటిమలు ఉన్నా ఐస్ క్యూబ్ తీసుకుని క్లాత్‌లో వేసుకుని ముఖంపై రబ్ చేయాలి. రోజూ వద్దు.. అప్పుడప్పుడు చేయటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
ముఖానికి పగటి సమయంలో ఫేస్ క్రీమ్ లేదా పౌడర్ వాడితే దాన్ని రాత్రికి శుభ్రం చేసుకోవడం మర్చిపోవద్దు. రాత్రి పడుకునే ముందు తప్పనిసరిగా మేకప్ తీసేసి నిద్ర పోవాలి.
నిమ్మ, తులసి ఆకుల రసం సమపాళ్ళలో కలిపి రోజూ రెండుసార్లు ముఖానికి పట్టించాలి. ఇలా చేయటం వల్ల ముఖం కాంతి వంతంగా మారుతుంది.
బక్కెట్ నిండా నీళ్లు తీసుకుని దాన్లో రెండు నిమ్మకాయలు పిండాలి. ఆ రసం నీళ్ళలో బాగా కలిసాక ఆ నీళ్ళతో స్నానం చేయాలి. ఇలా నెలరోజుల పాటు చేస్తే చర్మం ఆరోగ్యవంతంగా మారుతుంది.
మీగడలో పసుపు కలిపి రోజూ చర్మానికి రాయండి. పదినిమిషాల తర్వాత మెత్తగా, నెమ్మదిగా మసాజ్ చేయాలి. ఇలా చేస్తే ముఖం కాంతివంతంగా మారుతుంది.
శనగపిండి, నెయ్యి, పసుపు పేస్టులా తయారుచేసి చర్మంపై రాయాలి. కొద్దిగా ఆరాక చేత్తో మృదువుగా గుండ్రంగా మసాజ్ చేయాలి. ఇలా చేస్తే మీ పొడిబారిన చర్మం పై ఉన్న మురికి తొలగిపోతుంది. దీనితో పాటు నలుపు తగ్గిపోయి చర్మం ఛామన చాయ వర్ణానికి వస్తుంది.
స్నానం చేయడానికి పది పదిహేను నిమిషాల ముందు శరీరానికి శనగపిండి, పచ్చిపాలు పసుపు కలిపిన మిశ్రమాన్ని పట్టించాలి. అలాగే ప్రతి రోజూ చర్మానికి తేనె పూతగా రాయాలి. ఆ తర్వాత స్నానం చేయండి. మంచి ఫలితం ఉంటుంది.
బంగాళాదుంపల రసం తీసి ముఖానికి రాసుకోండి. అర్ధగంట వరకూ అలాగే ఉంచండి. వారానికి రెండు, మూడు సార్లు ఇలా చేయడం వల్ల టాన్ తగ్గుతుంది. గంధం పొడి, పసుపు, రోజ్‌వాటర్ మిశ్రమాన్ని ముఖానికి పట్టించినా మంచి ఫలితం ఉంటుంది.
నానబెట్టిన బాదం పప్పుల్ని పచ్చిపాలలో కలిపి పేస్టులా చేయాలి. ఈ పేస్టును ముఖం మీద రాసిక ఒక గంటసేపు ఉంచు కోవాలి. రాత్రిపూట దీన్ని రాసుకుని పడుకుంటే ముఖ అందానికి మేలు కలుగుతుంది. వీలైనప్పుడల్లా ఈ ప్యాక్ వేసుకోవడానికి ట్రై చేయండి.