డార్లింగ్‌ అభిమానులకు పూనకాలు వచ్చే అప్డేట్‌.. సలార్‌ రిలీజ్‌ అప్పుడేనంటా..!

-

డార్లింగ్‌ ప్రభాస్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సలార్‌ నుంచి రిలీజ్‌ కు సంబంధించిన అప్డేట్‌ వచ్చింది. ప్ర‌భాస్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న లేటెస్ట్ చిత్రం స‌లార్‌. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న‌ ఈ చిత్రం ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. కేజీఎఫ్-2 ఘ‌న విజ‌యం సాధించ‌డంతో ప్ర‌భాస్ అభిమానులంతా ఈ సినిమాపై భారీ అంచ‌నాల‌ను పెట్టుకున్నారు. అయితే షూటింగ్‌ ప్రారంభై నెల‌లు గుడుస్తున్న చిత్రానికి సంబంధించిన అప‌డేట్‌లు మాత్రం రావ‌డంలేదు. ఈ విష‌యంలో మాత్రం డార్లింగ్ అభిమానులు మేక‌ర్స్‌పై తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన బిగ్ అప్‌డేట్ ఒక‌టి నెట్టంట తెగ వైర‌ల్‌గా మారింది. స‌లార్ చిత్రానికి సంబంధించిన విడుద‌ల తేదీ సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతుంది.

Salaar: The director who put the brakes on the Salar shooting by Darling ..  Do you know why? | Southstar Prabhas' Weight Issues Leaves Director  Prashant Neel In Misery, Won't Resume The

ఓవ‌ర్సీస్ సెన్సార్ బోర్డు మెంబ‌ర్ ఉమ‌ర్ సందు త‌న ట్విట్ట‌ర్‌లో స‌లార్ రిలీజ్ డేట్‌ను ప్ర‌క‌టించాడు. వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 14న స‌లార్ విడుద‌ల కానున్న‌ట్లు పేర్కొన్నాడు. ఇందులో నిజ‌మెంతుందో తెలియదు కాని ప్ర‌భాస్ అభిమానులు మాత్రం ఖుషి అవుతున్నారు. అవుట్ అండ అవుట్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ప్ర‌భాస్‌కు జోడీగా శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఇప్ప‌టికే చిత్రం నుండి విడుద‌లైన ప్రభాస్ పోస్ట‌ర్‌ల‌కు ప్రేక్ష‌కుల నుండి విశేష స్పంద‌న వ‌చ్చింది. హోంబ‌లే సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ రెండు పాత్ర‌ల్లో తండ్రి, కొడుకులుగా న‌టించ‌నున్న‌ట్లు టాక్.

 

Read more RELATED
Recommended to you

Latest news