ఏకంగా సీఎంనే లేపేస్తానని.. ఆయనకే మెసేజ్ పెట్టాడు !

ఈమధ్య కేటుగాళ్లు మరీ బరితెగిస్తున్నారు. చిన్న చిన్న వాళ్ళ దగ్గర ఏం దోచుకుంటాం అని అనుకుంటున్నారేమో, ఏకంగా మంత్రులు సీఎం స్థాయి వ్యక్తులనే బెదిరించడం మొదలు పెట్టారు. తాజాగా గోవా సీఎంని లేపేస్తానని ఒక వ్యక్తి వార్నింగ్ ఇవ్వడం కలకలం రేపుతోంది. గోవా పోలీసుల కథనం ప్రకారం గోవా సీఎం ప్రమోద్ సావంత్ పర్సనల్ మొబైల్ ఫోన్ కి ఒక ఎస్ఎంఎస్ వచ్చింది.

దాని ప్రకారం ఆయన తనకు డబ్బు చెల్లించకపోతే ఆయన లేపేస్తామని వార్నింగ్ ఇచ్చారు దుండగులు. సీఎం పర్సనల్ సెక్రెటరీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆ మెసేజి ఫోన్ నుంచి వచ్చింది ? ఆ నెంబర్ ఎవరి పేరు మీద ఉంది ? లాంటి వివరాలు తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించి పనాజీ పోలీస్ స్టేషన్ పరిధిలో క్రిమినల్ కేసు నమోదైంది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది.