విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్ నుంచి గోవా టూర్ ప్యాకేజీ… డబ్బులు కూడా తక్కువే…!

-

కరోనా మహమ్మారి వలన ఏ టూర్ కి వెళ్లలేని పరిస్థితి వచ్చింది. అయితే మీరు ఎప్పటి నుండో టూర్ కి వెళ్లాలని అనుకున్నా కుదరకపోతే ఈ టూర్ వేసేయండి. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్‌కు చెందిన ఐఆర్‌సీటీసీ టూరిజం టూర్ ప్యాకేజీని తీసుకు వచ్చింది. ఇక ఈ టూర్ కి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. ‘గ్రేషియస్ గోవా విత్ హంపి టూర్’ పేరుతో ఈ టూర్ ని తీసుకు వచ్చారు. ఈ ప్యాకేజీలో భాగంగా హంపి, గోవా లాంటి ప్రాంతాలకు వెళ్ళచ్చు.

భారత్ దర్శన్ టూరిస్ట్ ట్రైన్‌లో తీసికెళ్లనున్నారు. 2022 ఫిబ్రవరి 12న అనకాపల్లి నుంచి ఈ టూరిస్ట్ ట్రైన్ స్టార్ట్ అవుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన స్టేషన్లలో రైలు ఆగుతుంది. 6 రాత్రులు, 7 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. మొదటి రోజు పర్యాటకులు అనకాపల్లి, విశాఖపట్నం, దువ్వాడ, సామర్లకోట జంక్షన్, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ జంక్షన్, ఖమ్మం, వరంగల్, కాజీపేట్, సికింద్రాబాద్ జంక్షన్‌లో రైలు ఎక్కాలి. రెండవ రోజు కర్నూలు, గుంతకల్లులో ప్రయాణికులు రైలు ఎక్కచ్చు. రెండో రోజు పర్యాటకులు హోస్‌పేట్ చేరుకుంటారు.

హేమకుంట హిల్ ఆలయం, విజయ విఠల, హంపి, శ్రీ విరూపాక్ష టెంపుల్ చూడచ్చు. నెక్స్ట్ మడగావ్ వెళ్ళాలి. సొంత ఖర్చులతో డోనా పౌలా మండోవి రివర్ క్రూజ్‌లో ప్రయాణించొచ్చు. నైట్ గోవాలో స్టే చెయ్యాలి. నాలుగో రోజు గోవా సైట్‌సీయింగ్ ఉంటుంది. వగటార్ బీచ్, ఫోర్ట్ అగ్వాడా, బసిలికా ఆఫ్ బామ్ జీసస్, క్యాథడ్రాల్ లాంటి ప్రంతాలు చూడొచ్చు. ఇక ఐదో రోజు అయితే మంగేష్ ఆలయం, శ్రీ శాంతదుర్గ ఆలయం, కోల్వా బీచ్ చూడచ్చు.

ఆరో రోజు పర్యాటకులు గుంతకల్ జంక్షన్, కర్నూలు సిటీ, సికింద్రాబాద్ జంక్షన్, కాజిపేట్ జంక్షన్, వరంగల్, ఖమ్మం, విజయవాడ జంక్షన్, ఏలూరులో రైలు ఆగుతుంది. ఏడో రోజు రాజమండ్రి, సామర్లకోట జంక్షన్, తుని, దువ్వాడ, విశాఖపట్నం, అనకాపల్లిలో రైలు ఆగుతుంది. ఎవరి స్టేషన్ లో వాళ్ళు దిగచ్చు. స్టాండర్డ్ ప్యాకేజీ ధర రూ.6,620 కాగా, కంఫర్ట్ ప్యాకేజీ ధర రూ.8,090. పూర్తి వివరాలను https://www.irctctourism.com/ వెబ్‌సైట్‌లో చూడచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news