కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఆన్ లైన్ ఛానల్స్ మీద ఇక మీదట కేంద్రం నిఘా ఉంచనున్నట్లు సమాచారం. ఇక మీదట ఎవరయినా కొత్తగా ఎవరైనా ఆన్లైన్ చానల్స్ ఓపెన్ చేసేందుకు కూడా కేంద్రం అనుమతి తీసుకోవడం తప్పనిసరి చేస్తూ కేంద్రం కొత్తగా ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం.
యూట్యూబ్ చానల్స్ అలానే ఓటీటీ కంటెంట్ లను సమాచార శాఖ పరిధిలోకి కేంద్రం తీసుకు వస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్టు చెబుతున్నారు. ఓటీటీలో భారీగా పెరుగుతున్న అశ్లీలతని కట్టడి చేయడానికి కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. దీంతో ఇక మీదట యూట్యూబ్ లో ఎవరు పడితే వారు ఇక ముందు లాగా చానల్స్ కూడా ఓపెన్ చేసేందుకు అవకాశం ఉండకపోవచ్చని చెబుతున్నారు. కేంద్రం మార్గదర్శకాల ప్రకారమే అన్నీ చేయాల్సి ఉంటుంది.