తగ్గిన బంగారం ధర.. వెండి మాత్రం !

-

గత కొద్ది రోజులుగా తగ్గుతూ పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఈ రోజు స్వల్పంగా తగ్గాయి. ఇక మన దేశంలో బంగారం ధర తగ్గితే వెండి ధర మాత్రం పెద్దగా ఏమీ మారలేదు. నిజానికి గత కొద్ది రోజులుగా బంగారం ధర పెరుగుతూ వస్తోంది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా పెరుగుతూ పోతుంది. ఈ రోజు మాత్రం అలా కాకుండా ఒకటి పెరిగితే మరొకటి మాత్రం స్థిరంగా ఉంది. అలాగే రెండు ధరలూ తగ్గాయి. హైదరాబాద్‌ సహా విశాఖ పట్నం, విజయవాడ మార్కెట్లలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

10 గ్రాముల 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర 50 రూపాయలు తగ్గి రూ. 49,210కి దిగింది. అలాగే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 45,160గా ఉంది. ఇక నేటి వెండి ధరలు విషయానికి వస్తే నిన్నటితో పోలిస్తే ధరల్లో ఎలాంటి మార్పూ లేదు. ఈరోజు హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 67,700గా ఉంది. 100 గ్రాముల వెండి ధర రూ. 6,770గా ఉంది. మరోవైపు దేశంలో నేడు ప్రధాన నగరాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలు ఇలా ఉన్నాయి.. చెన్నై -రూ. 50,310, ఢిల్లీ-రూ. 51, 610, బెంగళూరు- రూ. 49,210, కోల్‌కతా- రూ. 50,610, ముంబై- రూ. 48,640. 

Read more RELATED
Recommended to you

Latest news