అల్లు అర్జున్ కెరీర్లో అత్యంత డిజాస్టర్ గా నిలిచిన చిత్రం ఏదైనా ఉందంటే అది నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే చెప్పాలి. దర్శకుడిగా వక్కంతం వంశీకి తిరుగులేని దెబ్బ పడిందీ చిత్రంతో. మొదటి సినిమాకే డిజాస్టర్ టాక్ రావడంతో వంశీకి అవకాశాలు సన్నగిల్లాయి. అయితే తెలుగులో ఫ్లాప్ అనిపించుకున్న ఈ చిత్రానికి బాలీవుడ్ లో సూపర్ రెస్పాన్స్ వస్తుంది. అల్రెడీ హిందీ డబ్బింగ్ కి యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ వచ్చాయి.
తాజాగా ఈ చిత్రాన్ని థియేటర్లలో ప్రదర్శించారు. కరోనా కారణంగా బాలీవుడ్ సినిమాలేవీ లేకపోవడంతో నా పేరు సూర్య సినిమాని థియేటర్లలో వేసారు. అందరినీ ఆశ్చర్యపరుస్తూ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాకి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. ఈ టైమ్ లో బాలీవుడ్ సినిమాలకి కూడా రానటువంటి కలెక్షన్లు వస్తున్నాయట. పుష్ప సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న బన్నీకి ఈ సినిమా రెస్పాన్స్ మరింత ప్లస్ అవనుంది.