భారత్ విషయంలో వికీపీడియా పెద్ద తప్పు… వార్నింగ్ ఇచ్చిన మోడీ సర్కార్

-

చైనాలో భాగంగా అక్సాయ్-చిన్ను చూపించిన మ్యాప్‌ పై భారత్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ సైట్ నుండి ఈ మ్యాప్ ని తొలగించాలని భారత ప్రభుత్వం ఆన్‌ లైన్ ఎన్‌ సైక్లోపీడియా వికీపీడియాను బుధవారం కోరింది. ఐటి చట్టం సెక్షన్ 69 ఎ (డిజిటల్ సమాచారానికి ప్రజల ప్రాప్యతను నిరోధించడం) కింద ఉన్న లింక్‌ ను తొలగించాలని ఎలక్ట్రానిక్స్ మరియు ఐటి మంత్రిత్వ శాఖ వికీపీడియాకు ఆదేశించింది.

భారత్-భూటాన్ సంబంధానికి సంబంధించిన వికీపీడియా పేజీ జమ్మూ కాశ్మీర్ మ్యాప్‌ను తప్పుగా చిత్రీకరించిందని, చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఒక సోషల్ మీడియా యూజర్ కోరారు. దీనితో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని తెలుసుకున్న మంత్రిత్వ శాఖ భారతదేశం యొక్క ప్రాదేశిక సమగ్రతను మరియు సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించినందున సదరు మ్యాప్‌ ను తొలగించాలని వికీపీడియాకు ఆదేశాలు పంపింది. ఆదేశాలు అమలు చేయకపోతే భారత్ లో సదరు సైట్ ని నిలిపివేయవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news