బ్రేకింగ్‌: భారీగా పైకెగ‌సిన బంగారం ధ‌ర‌.. వెండి కూడా పైపైకే..!

-

గ‌త మూడు రోజులుగా పెరుగుతూ వ‌స్తున్న బంగారం ధ‌ర ఈ రోజు కూడా భారీగా పైకి క‌దిలింది. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర సోమవారం పెరిగింది. రూ.430 పైకి కదిలింది. దీంతో బంగారం ధర రూ.41,660 నుంచి రూ.42,090 చేరింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.430 పెరుగుదలతో రూ.38,190 నుంచి రూ.38,620కు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో పయనించింది. కేజీ వెండి రూ.140 పైకి కదిలింది. దీంతో ధర రూ.49,060 నుంచి రూ.49,200కు పెరిగింది.

ఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.450 పైకి కదిలింది. దీంతో ధర రూ.39,450కు చేరింది. అదే స‌మ‌యంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.450 పెరుగుదలతో రూ.40,650కు ఎగసింది. ఇక కేజీ వెండి ధర రూ.140 పెరుగుదలతో రూ.49,200కు చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news