బ్రేకింగ్‌: మ‌ళ్లీ పైపైకి ఎగ‌సిన బంగారం ధ‌ర‌.. వెండి కూడా…

-

నాలుగు రోజులుగా పెరుగుతూ వ‌స్తున్న బంగారం ధర ఈ రోజు కూడా అదే బాట‌లో న‌డిచింది. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర మంగళవారం పెరిగింది. రూ.130 పైకి కదిలింది. దీంతో బంగారం ధర రూ.42,100 నుంచి రూ.42,230 చేరింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.130 పెరుగుదలతో రూ.38,630 నుంచి రూ38,760 చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో పయనించింది. కేజీ వెండి ఏకంగా రూ.400 పైకి కదిలింది. దీంతో ధర రూ.49,200 నుంచి రూ.49,600కు పెరిగింది.

ఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.140 పైకి కదిలింది. దీంతో ధర రూ.39,600కు చేరింది. అదే స‌మ‌యంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.140 పెరుగుదలతో రూ.40,800కు ఎగసింది. ఇక కేజీ వెండి ధర రూ.400 పెరుగుదలతో రూ.49,600కు చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news