ఆన్లైన్ గేమ్స్ ఆడొద్దని తండ్రి చెప్పడంతో, ఎం చేసాడంటే…!

-

ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ పుణ్యమా అని ప్రతీ ఒక్కరు ఆన్లైన్ గేమ్స్ కి అలవాటు పడిపోయారు. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఈ స్మార్ట్ ఫోన్స్ తో తమ సమయాన్ని వృధా చేసుకుంటూనే ఉన్నారు. ముఖ్యంగా విద్యార్ధులు చదువులు మానేసి దాని మీదే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు. దీనితో తమ బంగారు భవితను విద్యార్ధులు నాశనం చేసుకుంటున్నారు.

ఇక వద్దని వారిస్తే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కూడా ఉంది. చెన్నై శివారు ప్రాంతం కట్టుపేడికి చెందిన రామప్పన్‌ కుమారుడు ఆకాశ్‌ ప్లస్‌ టూ ముగించి మూన్‌జార్‌పట్టిలో ఓ ప్రైవేటు పోలీసు శిక్షణ కేంద్రంలో ప్రస్తుతం విద్యను అభ్యసిస్తున్నాడు. 19 ఏళ్ళ ఆకాష్ కి స్మార్ట్ ఫోన్ లో గేమ్స్ ఆడే అలవాటు ఎక్కువగా ఉంది. కెరీర్ ని పక్కన పెట్టి మరీ అతను దీనిపై ఎక్కువ సమయాన్ని కేటాయించడంతో తండ్రి ఆగ్రహం వ్యక్తం చేసాడు.

ఆ అలవాటు మానుకోవాలని ఎన్ని సార్లు చెప్పినా సరే మానలేదు. ఈ నేపధ్యంలో ఆకాశ్‌ ఫోన్‌లో గేమ్‌ ఆడుతుండడం చూసిన తండ్రి తీవ్రంగా మందలించడంతో పాటుగా చేతిలో ఉన్న ఫోన్ లాక్కున్నాడు. దీనితో తీవ్ర మనస్తాపం చెందిన ఆకాశ్‌ ఇంటి సమీపంలోని చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వేలూరు తాలూకా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news