గుడ్ న్యూస్‌: భారీగా ప‌త‌న‌మైన బంగారం ధ‌ర‌.. వెండి కూడా..

-

నిన్న స్వ‌ల్పంగా దిగొచ్చిన బంగారం ధ‌ర‌.. ఈ రోజు భారీగా ప‌త‌న‌మైంది. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర గురువారం భారీగానే తగ్గింది. రూ.340 క్షీణంచింది. దీంతో బంగారం ధర రూ.38,720 నుంచి రూ.38,380కు దిగొచ్చింది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా పడిపోయింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.340 తగ్గుదలతో రూ.42,240 నుంచి రూ.41,900కు క్షీణించింది. బంగారం ధర పడిపోతే వెండి ధర కూడా అదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర రూ.400 త‌గ్గ‌డంతో ధర రూ.49,600 నుంచి రూ.49,200కు దిగొచ్చింది.

ఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.350 దిగొచ్చింది. దీంతో ధర రూ.39,200కు తగ్గింది. అదే స‌మ‌యంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.350 తగ్గుదలతో రూ.40,400కు క్షీణించింది. మ‌రోవైపు బంగారంతో పాటు కేజీ వెండి ధర కూడా త‌గ్గింది. దీంతో రూ.400 క్షీణతతో రూ.49,200కు తగ్గింది.

Read more RELATED
Recommended to you

Latest news