కరోనా ప్రయోగాలలో ఘన విజయం…!

-

కరోనా వైరస్‌ కి మందు కనుక్కోవడానికి గానూ అన్ని దేశాలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. చైనాతో పాటు అన్ని దేశాలు ఈ వైరస్ కి మందుని కనుక్కునే పనిలో పడ్డాయి. దీని ఆట కట్టించాలని భావిస్తూ అనేక ప్రయోగాలు చేస్తున్నారు పరిశోధకులు. ఈ నేపధ్యంలో ఆస్ట్రేలియా ఒక విజయవంతమైన ప్రయోగం చేసింది. ఆస్ట్రేలియా సైంటిస్టులు విజయవంతమైన ప్రయోగం చేసారు.

తొలిసారిగా వారు చైనా వెలుపల కరోనా వైరస్‌ను రీ క్రియేట్ చేశారు. ఇది తాము సాధించిన ఘన విజయమని వారు అంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థతో వీరు కలిసి తమ పరిశోధనలను కొనసాగిస్తామని, ప్రపంచ వ్యాప్తంగా వ్యాధిని గుర్తించేందుకు దీన్ని రూపొందిస్తున్నామని, అంటువ్యాధులపై పరిశోధన చేస్తున్న డాక్టర్ మైక్ కాటన్ మీడియాకు తెలిపారు. మెల్బోర్న్ యూనివర్శిటీ, రాయల్ మెల్బోర్న్ హాస్పిటల్ కలిసి దీన్ని తయారు చేసారు.

నూతన కరోనా వైరస్ జినోమ్ సీక్వెన్స్‌ను చైనా అధికారులు ఇప్పటికే విడుదల చేయడం, ఆస్ట్రేలియా కూడా దీనిపై ముందు అడుగు వేయడంతో వ్యాక్సిన్ ని కనుక్కోవడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఆస్ట్రేలియా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇతర దేశాల్లో ఉన్న తమ పౌరులను రప్పించి వారికి 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్రిస్మస్ దీవిలో ఆశ్రయం కల్పించనుంది. అక్కడే వారికి వైద్యం అందిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news