బ్రేకింగ్‌: మ‌రోసారి దిగొచ్చిన బంగారం ధ‌ర‌.. వెండి కూడా..

-

నిన్న త‌గ్గుద‌ల న‌మోదు చేసిన బంగారం ధ‌ర ఈ రోజు కూడా దిగొచ్చింది.హైదరాబాద్ మార్కెట్లో గురువారం బంగారం ధరలు స్వల్పంగా కిందికి దిగాయి. 24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు 470 రూపాయలు తగ్గింది. 24 రెట్ల బంగారం పది గ్రాములకు 42,450 నుంచి 41,980 రూపాయలకు తగ్గింది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గుదల నమోదు చేసింది. పది గ్రాములకు 290 రూపాయలు తగ్గడంతో 38,770 నుంచి 38,480 రూపాయల వద్దకు చేరుకుంది. ఒకవైపు బంగారం ధరలు స్వల్ప తగ్గుదలను నమోదు చేయగా, వెండి ధరలు రెండోరోజూ భారీగా పతనమయ్యాయి. వెండి ధరలు కేజీకి 500 త‌గ్గ‌గా.. కేజీకి 48,000 రూపాయల వద్ద నిలిచాయి.

ఇక ఢిల్లీ మార్కెట్ లో కూడా బంగారం ధరలు తగ్గుదల నమోదు చేశాయి. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ఇక్కడా 300 రూపాయలుతగ్గింది. దీంతో ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 40,500 రూపాయల వద్దకు చేరుకుంది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 300 రూపాయల తగ్గుదల నమోదు చేసి 39,300 రూపాయలకు చేరింది. ఇక వెండి ధర ఇక్కడా భారీగా తగ్గింది.. దాంతో వెండి ధర కేజీకి 48,000 రూపాయలుగా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news