గుడ్ న్యూస్‌: క్షీణించిన బంగారం ధ‌ర‌.. వెండిదీ ఇదే దారి..!

-

నిన్న భారీగా క్షీణించిన బంగారం ధ‌ర మ‌ళ్లీ అదే దారిలో న‌డిచింది. హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం 22 క్యారెట్ల బంగారం ధర స్వల్పంగా దిగొచ్చింది. పసిడి ధర 10 గ్రాములకు రూ.20 క్షీణించింది. దీంతో రూ.39,150 నుంచి రూ.39,130కు తగ్గింది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. స్థిరంగానే కొనసాగింది. దీంతో పసిడి ధర 10 గ్రాములకు రూ.42,640 వద్దనే నిలకడగానే ఉంది. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర రూ.50 తగ్గింది. దీంతో ధర రూ.49,550 నుంచి రూ.49,500కు క్షీణించింది.

ఢిల్లీ మార్కెట్‌లో బంగారం ధర స్థిరంగానే కొనసాగింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారంలో ఎలాంటి మార్పు లేదు. రూ.41,150 వద్దనే ఉంది. అదే ప‌మ‌యంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా స్థిరంగా రూ.39,950 వద్దనే కొనసాగుతోంది. ఇక బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర రూ.49,500కు తగ్గింది.

Read more RELATED
Recommended to you

Latest news